పోలీసులపై దాష్టీకాలా?

3 May, 2020 02:21 IST|Sakshi

క్లిష్ట పరిస్థితుల్లో మద్దతుగా నిలవాల్సింది పోయి దాడులు

పాతబస్తీలో కానిస్టేబుల్‌పై కార్పొరేటర్‌ దాడి

సాక్షి, హైదరాబాద్‌: వనపర్తిలో ఓ కానిస్టేబుల్‌ వాహనదారుడిపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ సస్పెండ్‌ చేశారు. వాస్తవానికి తొలుత ఆ వాహనదారుడే పోలీసుపై దాడికి దిగిన వీడియో మరునాడు విడుదలైనా ఎవరూ పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై ఓ కార్పొరేటర్‌ అకారణంగా చేయి చేసుకున్నాడు. కరోనా మహమ్మారిపై పోరులో వైద్యుల తరువాత పోలీసులు కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. కానీ, పలువురు నేతలు, పౌరులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

పోలీసులపై తి రగబడటం, వారిపై చేయి చేసుకోవడం కొం దరు అలవాటుగా మార్చుకుంటున్నారు. 40 రోజులకుపైగా కుటుంబానికి దూరంగా, ఎండనకా వాననకా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విధులు నిర్వహిస్తోన్న పో లీసులపై దాడులకు దిగుతూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీ యడం సబబేనా అన్న ప్ర శ్న పోలీసు కుటుంబాల్లో మొదలైంది. చిన్నాచి తకా విషయాల్లో వా స్తవాలు తెలుసుకోకుం డా రాజకీయ ఒత్తిడి, క్రమశిక్షణ పేరిట చర్య లు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని  ఐపీఎస్‌ అధికారులే వాపోతున్నారు.

వీరందరికీ కరోనా ఎందుకు వచ్చింది?
డిపార్ట్‌మెంటులో ఇప్పటికే ఐదుగురు పోలీసు లు కరోనా బారినపడ్డారు. ఇన్ని త్యాగాలు చే స్తోంటే తిరిగి వారిపై దాడులు చేయడం, వారి నే కించపరిచేలా ప్రవర్తించడంపై పోలీసుల్లో అసంతృప్తి మొదలైంది. అసలు రాష్ట్రంలో తబ్లి గీ జమాత్‌కు వెళ్లొచ్చినవారిని గుర్తించడంలో పోలీసుల పాత్ర మరువలేనిది. కరోనా పా జిటివ్‌ రోగుల గుర్తింపు, ఐసోలేషన్‌ కేంద్రాల కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో గస్తీ కాయడం, కంటైన్మెంట్‌ జోన్లను పరిరక్షించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి విధుల వల్లే ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం రాజకీయ నేతలకు తెలియంది కాదు.

పాతబస్తీలో మరింత చెలరేగుతున్నారు..
పాతబస్తీలో పలువురికి అసలు లాక్‌డౌన్‌ ఎం దుకు విధించారో అవగాహన లేదు. మాస్కు లు, హెల్మెట్లు లేకుండా ఇష్టానుసారం బయటి కి వస్తూ గుంపులుగా తిరుగుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద నగరంలోనే అధిక కేసులు నమోదవడానికి ఈ నిబంధనల ఉల్లంఘనా ఒక కా రణమే. ఇదేంటని అడిగితే ప్రజలు, నేతలు పో లీసుల మీదకే తిరగబడుతున్నారు. ఇటీవల హోంమంత్రి కూడా ప్రజలపై లాఠీలు ఝుళి పించవద్దంటూ ఆదేశాలిచ్చి పోలీసుల చేతులు కట్టేసినంత పని చేశారు. ఆ మరునాడే ఓ కార్పొరేటర్‌ కానిస్టేబుల్‌పై చేయిచేసుకోవడం గమనార్హం. ఇలాగైతే పాతబస్తీలో పని చేయలేమని పోలీస్‌ సిబ్బంది అంటున్నారు. 

మరిన్ని వార్తలు