మండలి ప్రచారానికి గులాబీ దండు

7 Mar, 2015 02:59 IST|Sakshi

9వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటనలు మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో ప్రచారపర్వం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి ఎన్నికలను గులాబీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునేందుకు పార్టీ అగ్రనేతలను మోహరిస్తోంది. మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాత్మకంగా కదులుతోంది.

టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగిన ఉద్యోగసంఘాల నేత దేవీప్రసాద్‌ను గెలిపించే బాధ్యతను నెత్తినెత్తుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈనెల 9వ తేదీ నుంచి నియోజకవర్గాల  వారీగా జరిగే ప్రచారపర్వంలో పాల్గొననున్నారు. కేటీఆర్ సహా జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొనే ఈ ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ శుక్రవారం ప్రకటించారు. 9న వికారాబాద్, తాండూరు, 10న చేవెళ్ల, పరిగి, 12న రాజేంద్రనగర్, మహేశ్వరం, 14న ఎల్‌బీ నగర్, 15న మల్కాజిగిరి, ఉప్పల్, 18న కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, 19న ఇబ్రహీంపట్నం, మేడ్చల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొంటారని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా