కౌన్సిల్ ఛైర్మన్ పదవి టీఆర్ఎస్కే: ఆమోస్

7 Jun, 2014 14:01 IST|Sakshi
కౌన్సిల్ ఛైర్మన్ పదవి టీఆర్ఎస్కే: ఆమోస్

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ పదవిని టీఆర్ఎస్కే ఇవ్వాలని సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు కేఆర్ ఆమోస్ అన్నారు. తమకు మెజారిటీ ఎమ్మెల్సీలు ఉన్నారన్న పేరుతో ఛైర్మన్ పదవి కావాలనడం కాంగ్రెస్ పార్టీకి తగదని ఆయన హితవు పలికారు. స్పీకర్, ఛైర్మన్ పదవులను ఎప్పుడూ అధికార పార్టీకే ఇవ్వాలన్న సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించాలని చెప్పారు.

ఇక తెలంగాణ ఎమ్మెల్సీలంతా మళ్లీ ప్రమాణస్వీకారం చేయాల్సిందేనని ఆమోస్‌ అన్నారు. ఇంతకుముందు వారు ఏపీ కౌన్సిల్‌ సభ్యులుగా ప్రమాణం చేశారని, ఇప్పుడు తెలంగాణ ఏర్పడినందున టి.కౌన్సిల్‌ సభ్యులుగా ప్రమాణం చేయాలని తెలిపారు. డిప్యూటీ ఛైర్మన్‌ తెలంగాణ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తారని విభజన బిల్లులోనే ఉన్నందున ఆయనే ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని అన్నారు.

మరిన్ని వార్తలు