నకిలీ నోట్ల ఏజెంట్ అరెస్టు

4 May, 2015 02:08 IST|Sakshi

ఖమ్మం క్రైం : నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఏజెంట్‌ను ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ దక్షిణామూర్తి ఆదివారం విలేకరులతో తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. నగరంలోని బుర్హాన్‌పురంనకు చెందిన షేక్ అమీరుద్దీన్ పాన్‌షాప్ నడుపుతున్నాడు. గతనెల 29న అతని షాపునకు ఓవ్యక్తి వచ్చి హిందీలో మాట్లాడుతూ రూ. 1000 నోటు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. మిగితా చిల్లర డబ్బులు తీసుకుని వెళ్లిపోయూడు. ఆ రూ. 1000 నోట్‌ను ఈనెల 1న అమీరుద్దీన్ సరుకులు కొనుగోలు చేసేందుకు ఓ షాపునకు వెళ్లాడు. షాపు యజమాని నకిలీ నోటు అని చెప్పడంతో అమీరుద్దీన్ అవాక్కయ్యాడు.

టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే శాడు. మరుసటి రోజు అమీరుద్దీన్ బస్టాండ్‌కు వెళ్లగా తనకు నకిలీ నోట్ ఇచ్చిన వ్యక్తి తారసపడ్డాడు. వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా  పోలీసులు బస్టాండ్‌కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తిని బీహర్ రాష్ట్రంలోని బేగ్‌సరాయి జిల్లా పబ్ర గ్రామానికి చెందిన  అమరజిత్ కుమార్‌గా గుర్తించారు. ఇతను పశ్చిబెంగాల్‌లోని వజీర్ అనే వ్యక్తికి రూ. 40 వేల అసలు నోట్లు ఇచ్చి రూ. లక్ష  నకిలీ నోట్లను తీసుకున్నాడు.అనంతరం అమీరుద్దీన్ ఖమ్మం చేరుకుని కొంతకాలంగా ఇక్కడ పాన్ షాపులలో, చిల్లర దుకాణాలలో ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ నోట్లను మారుస్తున్నాడు.

అతను తెచ్చిన రూ. 100, రూ. 1000 నోట్లు 44 నకిలీవి ఇప్పటికే మార్చాడు. పోలీసులు అతని వద్ద ఉన్న 56 నకిలీ రూ .100, రూ. 500 నోట్లను స్వాధీన పర్చుకోన్నారు. అదేవిధంగా తాను ఇప్పటి వరకు మార్చిన రూ. 25 వేలల్లో రూ. 10 వేలు బ్యాంకులో జమచేయగా మిగతావిసొంత ఖర్చులకు వాడుకున్నట్లు తెలిపాడు. అతని వద్ద అసలు నగదును కూడా పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నకిలీ కరెన్సీ నోట్ల పట్ల ముఖ్యంగా చిరు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని  సూచించారు. నకిలీ కరెన్సీని ఎక్కువగా చిన్న వ్యాపారాలు చేసే వారి వద్దనే నిందితులు చలామణి చేస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ నోట్లు  చెలామణి చేస్తున్న వారిని గుర్తిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. నకిలీ నోట్ల నిందితుడిని పట్టుకున్న టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు సుబ్బయ్య, కుమార్ ఐడి పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.వారికి రివార్డులు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా