జీవోపై కోర్టుకెక్కింది వీరే

4 Aug, 2016 01:34 IST|Sakshi

న్యాల్‌కల్: 123 జీవో కోర్టు తీర్పు మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌లో భూ బాధితులు, కూలీల్లో ఆనందాన్ని నింపింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌కు పెద్ద ఎత్తున భూమిని సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇక్కడ కూడా 123 జీవో ప్రకారం భూసేకరణకు దిగగా, రైతు కూలీ సంఘం నాయకులు మోహన్ , రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్ లో హైకోర్టును ఆశ్రరుుంచారు. నిమ్జ్ భూ బాధితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం అందించాలని తీర్పు వెలువరించడంతో రైతులు, కూలీలతోపాటు అఖిల పక్షం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. న్యాల్‌కల్ మండలంలోని 14 గ్రామాలతోపాటు ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 12,635 ఎకరాలు నిమ్జ్ పేరుతో భూములను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణరుుంచారుు. మొదటి విడతగా ఝరాసంగం మండలం బర్దీపూర్, ఎల్గోరుు, చీలపల్లి, చీలపల్లి తండాతో పాటు న్యాల్‌కల్ మండలం ముంగి, ముంగి తండా, రుక్మాపూర్, రుక్మాపూర్ తండాలను ఎంపిక చేశారు.

అధికారులు ఆయా గ్రామాల పరిధిలోని పట్టా, అసైన్ ్డ భూముల వివరాలను సేకరించారు. పట్టా భూములకు ఎకరానికి రూ:5.80 లక్షలు, అసైన్ ్డ భూమికి ఎకరాకు రూ.3 లక్షల పైచిలుకు చెల్లించారు. అరుుతే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూములు సేకరిస్తుందని నిమ్జ్ భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. 123 జీఓను రద్దు చేసి 2013 చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ రైతు కూలీ సంఘం నాయకులు మోహన్ , రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్ లో హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. తీర్పు రైతులకు, కూలీలకు అనుకూలంగా రావడంతో బాధిత రైతులు, కూలీల్లో సంతోషం వ్యక్తమైంది.

మరిన్ని వార్తలు