పోలీసులపై న్యాయ విచారణ

16 Feb, 2018 04:00 IST|Sakshi
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆజాద్‌(ఫైల్‌)

ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆదిలాబాద్‌ అదనపు సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులు

ఎన్‌కౌంటర్‌పై పునర్విచారణ.. 29 మంది పోలీసులపై

హత్యా నేరం కింద విచారణకు ఆదేశం

ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై దేశంలోనే తొలిసారిగా హత్యా నేరం!

సాక్షి, ఆదిలాబాద్‌ : మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్‌ అలియాస్‌ చెరుకూరి రాజ్‌కుమార్‌ ఎన్‌కౌంటర్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఆజాద్‌ ఎన్‌కౌం టర్‌పై పునర్విచారణ చేపట్టాలని ఆదిలా బాద్‌ జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు (ఎస్సీ/ఎస్టీ కోర్టు) దిగువ కోర్టును ఆదేశించింది. ఈ కేసుతో సం బంధమున్న 29 మంది పోలీసులపై హత్యా నేరం కింద విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి భారతిలక్ష్మి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ బూటకమని, ఆ కేసులో పునర్వి చారణ జరపాలని, పోలీసులపై హత్యానేరం కింద విచారణ చేపట్టాలని ఆజాద్‌ భార్య గతం లోనే ఆదిలాబాద్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ కోర్టు 2015 మార్చి 24న ఈ పిటిషన్‌ను తిరస్కరిం చింది. దాంతో ఆమె జిల్లా కోర్టును ఆశ్రయిం చగా.. తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. గురువారం కోర్టుకు హాజరైన ఆజాద్‌ భార్య పద్మ, ఆమె తరఫు న్యాయవాది సురేశ్‌ కుమార్, ఆ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జర్నలిస్టు హేమచంద్ర పాండే భార్య బబిత తరఫు న్యాయవాది, పౌర హక్కుల నేత రఘునాథ్‌ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద విచారణకు ఆదేశించడం దేశంలోనే ఇది తొలిసారి అని వారు పేర్కొన్నారు.

తిరస్కరించిన ఫస్ట్‌క్లాస్‌ కోర్టు..
సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా ఆజాద్‌ భార్య పద్మ, ఆమె తరఫు న్యాయవాది సురేశ్‌ 2013 జూలైలో ఆదిలాబాద్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టులో ప్రొటెక్ట్‌ పిటిషన్‌ వేశారు. ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ బూటకమని, బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయాలని, హత్యానేరం కింద విచారించాలని కోరారు. స్వామి అగ్నివేశ్‌ సైతం 2014 ఫిబ్ర వరి 17న కోర్టుకు హాజరై తన వాదనలు విని పించారు. రెండేళ్ల పాటు వాదనలు విన్న కోర్టు.. పిటిషన్‌ను తిరస్కరిస్తూ 2015 మార్చి 24న ఉత్తర్వులిచ్చింది. దీంతో పద్మ ఈ కేసును పున ర్విచారణ చేయాలని, ఎన్‌కౌంటర్‌తో సంబం« దమున్న పోలీసులపై న్యాయ విచారణ చేపట్టా లని కోరుతూ గతేడాది అక్టోబర్‌లో ఆదిలాబా ద్‌ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి పలుమార్లు వాదనలు జరిగాయి. సీబీఐ తర ఫున న్యాయవాది అలెగ్జాండర్‌ వాదనలు విని పించారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ మూర్తి తాజాగా పునర్విచారణకు ఆదేశించారు.

నమ్మకం పెరిగింది: పద్మ
ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు తీర్పు సంతోషాన్నిచ్చిందని ఆజాద్‌ భార్య పద్మ పేర్కొన్నారు. దీనితో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని చెప్పారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.

8 ఏళ్ల కిందట ఎన్‌కౌంటర్‌
2010 జూలై 2న ఆదిలాబాద్‌ జిల్లా సర్కేపల్లి–జోగాపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌ అలియాస్‌ చెరుకూరి రాజ్‌కుమార్, జర్నలిస్టు హేమచంద్ర పాండేలు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టు అగ్రనేతలకు మధ్య చర్చల కోసం స్వామి అగ్నివేశ్‌ మధ్యవర్తిత్వం జరుపుతున్న సమయంలో ఈ ఘటన జరగడం సంచలనం సృష్టించింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ స్వామి అగ్నివేశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆజాద్‌ను పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ నుంచి కాల్చి చంపారని పేర్కొంటూ.. పలు ఆధారాలు, పోస్టుమార్టం నివేదికలను కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు 2011 జనవరి 14న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాదనలు విన్న అనంతరం ఈ కేసును 2011 ఏప్రిల్‌ 15న సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు అప్పటి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ఎన్‌కౌంటర్‌ స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేశారు. ఆ ఎన్‌కౌంటర్‌ నిజమైనదేనంటూ సీబీఐ 2012లో 192 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే ఎన్‌కౌంటర్‌లో భాగస్వాములైన పోలీసుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉండటంతో.. ఆ నివేదిక ప్రతులను బాధిత కుటుంబాలకు అందజేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు సుమారు ఏడాది తర్వాత ఆజాద్‌ భార్య పద్మకు సీబీఐ నివేదిక ప్రతులు అందాయి.

మరిన్ని వార్తలు