పర్యటన వాయిదా వేసుకున్న కేసీఆర్‌

21 Mar, 2020 08:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల్లో భరోసా నింపేందుకు సీఎం కేసీఆర్‌ శనివారం కరీంనగర్‌ వెళ్లాలనుకున్న పర్యటన వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్‌పై ప్రజల్లో ధైర్యం నింపేందుకు కరీంనగర్‌ పర్యటనకు సీఎం సంకల్పించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పర్యటన వల్ల భారీగా జరుగుతున్న స్క్రీనింగ్, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా ఉండాలని కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం, వైద్య శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. దీంతో కేసీఆర్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కోవిడ్‌ పరిస్థితి సహా కరీంనగర్‌లో వైద్య ఏర్పాట్లపై కలెక్టర్, పోలీస్‌ కమిషనర్లతో శుక్రవారం కేసీఆర్‌ మాట్లాడారు. 

జనతా కర్ఫ్యూ విధిగా పాటించండి: సీఎం 
ప్రధాని పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూను రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా పాటించాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు, కార్యాచరణపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా