మరో రెండు కరోనా కేసులు.. మొత్తం 18

20 Mar, 2020 15:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కల్లోలానికి ప్రపంచదేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అన్ని దేశాలు ఈ మహమ్మారి వ్యాప్తి నివారణకు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినా కరోనా  వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.  ఇప్పటివరకు భారత్‌లో 209 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇందులో ఇతర దేశాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 18కు చేరుకుంది. శుక్రవారం మరో రెండు కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. 

‘ఇవాళ మరో రెండు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ పద్దెనిమిది మందిలో ఎవరికి ప్రాణాపాయం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకింది. తెలంగాణలో మరో 6 కరోనా ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నాం. వేల మందికి క్వారంటైన్‌ చేయగలిగేలా సన్నద్దం అయ్యాం’అని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఇక రేపు (శనివారం) సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కరోనా  నివరాణ చర్యలపై అక్కడి అధికారులుతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. 

చదవండి:
ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌కు కరోనా పాజిటివ్‌
పదో తరగతి పరీక్షలు వాయిదా

మరిన్ని వార్తలు