గ్రామీణుల రక్షణకే కోవిడ్‌ మొబైల్‌ బస్సు

22 May, 2020 05:18 IST|Sakshi

మంత్రి ఈటల రాజేందర్‌

సుల్తాన్‌బజార్‌(హైదరాబాద్‌): గ్రామీణ ప్రాంతాల్లో నివాసముంటున్న వారి విలువైన ప్రాణాలను కాపాడేందుకు ‘మొబైల్‌ కోవిడ్‌ ఐసీయు’బస్సు దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బస్సు ను గురువారం కోఠిలోని డీఎంఈ క్యాంపస్‌లో మా జీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రా రంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.. గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ వారు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం మొబైల్‌ బస్సును అంతకు ముం దు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. కోవిడ్‌–19 రోగుల ప్రాణాలను కాపాడేందుకు దేశంలో తొలిసారిగా కోవిడ్‌ ఐసీయూ మొబైల్‌ బ స్సును అందుబాటులోకి తెచ్చారని తెలిపారు.

ఈ బస్సులో ఎక్స్‌రే, మమోగ్రామ్, అల్ట్రాసౌండ్‌ వెంటిలేటర్, ఐసీయూ, టెలీ ఐసీయూ, కోవిడ్‌ టెస్టింగ్, రక్త పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లున్నాయని మంత్రి తెలిపారు. కోవిడ్‌–19 వ్యాధి మనకు కొత్త అనుభవమన్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా సోకిన రోగులకు వైద్యం చేస్తున్నారని, వారిపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. కరోనా వైరస్‌తో వ్యక్తులు చనిపోతే అంత్యక్రియలు చేయటానికి వారి బంధువులే భయపడే స్థితి ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల వారు కోవిడ్‌–19 రోగులకు చికిత్సలు చేస్తే అందుకు ప్రత్యేక వార్డులు పెట్టాలన్నారు.తమవి కోవిడ్‌ ఆసుపత్రులుగా ప్రకటించుకోవాలన్నారు. ప్రాణాపాయస్థితితో కొట్టుమిట్టాడే రోగులను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపకుం డా అక్కడే చికిత్సలు చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది, జీహెచ్‌ఎంసీ అధికారుల సా యంతో ఇప్పటికే గాంధీ, కింగ్‌కోఠి, గచ్చిబౌలిలో ట్రీట్‌మెంట్‌ కొనసాగుతుందన్నారు. 

కోవిడ్‌ మొబైల్‌ బస్సును ప్రారంభిస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌

మరిన్ని వార్తలు