అంతా సిద్ధం.. ధైర్యంగా ఓటెయ్యండి!

10 Apr, 2019 07:36 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

సిటీ ఓటర్లకు పిలుపు ఇచ్చిన సిటీ పోలీసు కమిషనర్‌

క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పక్కా ఏర్పాట్లు

బందోబస్తు, భద్రత విధుల్లో 15,845 మంది సిబ్బంది

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు తీసుకురావడం నిషేధం

విలేకరులతో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ఓటరు ధైర్యంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. బందోబస్తు, భద్రత విధుల కోసం కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 15,845 మందిని వినియోగిస్తున్నామన్నారు. ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. పోలింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ తీసుకురావడాన్ని నిషేధించామని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు తోడు పొరుగున ఉన్న మల్కాజ్‌గిరి, చేవెళ్లలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు నగర పరిధిలో ఉన్నాయి. బందోబస్తు, భద్రత విధుల కోసం 16 వేల మంది పోలీసులతో పాటు 12 కంపెనీలు కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు వినియోగించనున్నారు.

యాకత్‌పురా నియోజకవర్గ పరిధి నుంచి నాలుగు పోలింగ్‌ స్టేషన్లు, బహదూర్‌పురా నుంచి ఐదు, జూబ్లీహిల్స్‌ నుంచి 13, సనత్‌నగర్‌ నుంచి 29 పొరుగున ఉన్న సైబరాబాద్, రాచకొండ పరిధిల్లో ఉన్నాయి. దీంతో ఆ పోలీసులతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నారు. మొత్తమ్మీద నగర పోలీసు కమిషనర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తుండగా, సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగెనవర్, హైదరాబాద్‌కు దక్షిణ మండల డీసీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సహాయ నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. వీరికి సహకరించడానికి, సమన్వయానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున 15 మంది ఏసీపీలు అసిస్టెంట్‌ నోడల్‌ ఆఫీసర్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల విధులకు సంబంధించి నగర పోలీసు విభాగంలోని అధికారులకు అవసరమైన శిక్షణ ఇచ్చారు. పోలీసు విభాగం రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నారు. నగర, కమిషనరేట్‌ సరిహద్దుల్లో అవసరమైన మేర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం పోలింగ్‌ స్టేషన్లను ఎస్‌1, ఎస్‌2, ఎస్‌3 క్రిటికల్, నార్మల్‌.. ఇలా నాలుగు క్యాటగిరీలుగా విభజించి బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 

నగరంలోని మొత్తం పోలింగ్‌ స్టేషన్లు: 1,600 ప్రాంతాల్లో 4,022
127 ప్రాంతాల్లోని 475 ఎస్‌1, 180 ప్రాంతా ల్లోని 554 ఎస్‌2, 123 ప్రాంతాల్లోని 316 ఎస్‌3 కేటగిరీల్లోకి రాగా.. 1,170 ప్రాంతాల్లోని 2,677 సాధారణ కేటగిరీలో ఉన్నాయి.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, మరో ఆరు స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్స్‌ నిర్విరామంగా పని చేస్తున్నాయి.  
అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉండేందుకు పోలీసు విభాగం ఆధీనంలో 60 క్యూఆర్టీ, 17 ఎస్‌ఎస్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉంటాయి.  
12 అంతర్‌ సరిహద్దు చెక్‌పోస్టులు, 51 అంత ర్గత చెక్‌పోస్టులు, 282 శాంతిభద్రతల విభా గం పికెట్లు, 93 ఇంటర్‌సెప్షన్‌ టీమ్స్‌ (శాంతి భద్రతల విభాగం, ట్రాఫిక్‌ విభాగం అధికారులు)తో పాటు అవసరమైన వారిని వెంబడించడానికి 20 షాడో టీమ్స్‌ ఏర్పాటయ్యాయి.  
పోలింగ్‌ రోజున 518 చెక్‌పోస్టుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.
సిబ్బంది, అధికారులు సమాచార మార్పిడి చేసుకునేందుకు 3,300 వైర్‌లెస్‌ సెట్లు ఇచ్చారు.
ఇప్పటికే కేంద్ర బలగాలతో కలిసి నగరంలో 226 ఫ్లాగ్‌ మార్చ్‌లు, 64 వెహికిల్‌ చెకింగ్స్‌ చేపట్టారు.  
పోలింగ్‌ అనంతరం ఈవీఎంలు నగరంలో ఏర్పాటు చేసిన 15 డీఆర్సీ సెంటర్లకు వెళ్తాయి. వీటి భద్రత కోసం కేంద్ర బలగాలనువాడుతున్నారు.  
మొత్తం 1,885 కేసుల్లో 5,530 మందిని బైండోవర్‌ చేయడంతో పాటు 11,188 పెట్టీ కేసులు నమోదు చేశారు. పెండింగ్‌లో ఉన్న 933 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను ఎగ్జిక్యూట్‌ చేశారు.
నగరంలో మోడల్‌ కోడల్‌ ఆఫ్‌ కాండక్ట్‌ఉల్లంఘనకు సంబంధించి 53 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం మినహాయింపులు పోనూ మొత్తం 4,618 మంది తమ లైసెన్డ్స్‌ ఆయుధాలు డిపాజిట్‌ చేశారు.

2014 ఎన్నికలు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు,తాజా పార్లమెంట్‌ ఎలక్షన్స్‌ నేపథ్యంలోపోలీసులు స్వాధీనం చేసుకున నగదు తదితరాలను పోలిస్తే...

మరిన్ని వార్తలు