పెట్రోలింగ్ వాహనాల శానిటైజేషన్ మొదలు!

4 Apr, 2020 12:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కట్టడికి తర్వాత పదిరోజులే కీలకమని, ఇప్పుడే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ అంజనీ కుమార్‌ సూచించారు. బషీరాబాగ్ సీపీ కార్యాలయం ముందు పెట్రోలింగ్ వాహనాల శానిటైజేషన్ సీపీ అంజనీ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హైదరాబాద్ సిటి లో 122 పెట్రోలింగ్ వాహనాలు ఉన్నాయి. పెట్రోలింగ్ వాహనాల సానిటైజేషన్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం తిరుగుతాయి. పెట్రోలింగ్ వాహనాల సానిటైజేషన్ తో వైరస్ వ్యాప్తి నివారించవచ్చు. తర్వాత పది రోజులే కీలకం. ఇప్పుడే జాగ్రత్తలు అవసరం. ప్రతి ఒక్కరు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి’ అని కోరారు. 

ఇప్పటివరకు తెలంగాణలో 229 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు. అయితే శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో 75 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 

చదవండి: రెడ్‌జోన్‌లోకి జిల్లాకేంద్రం

మరిన్ని వార్తలు