‘జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి’

21 Mar, 2020 16:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. శనివారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించామని పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూలో స్వచ్ఛంగా పాల్గోనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఐటి కంపెనీలకు, మతపెద్దలకు, ట్రాన్స్ పోర్టు వ్యాపారులకు తగుసూచనలు ఇచ్చామని వెల్లడించారు. రేపు(ఆదివారం) పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని, కరోనా తీవ్ర స్థాయికి చేరకుండా ఉండాలంటే జనతా కర్ఫ్యూను అందరం పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేశామని, ఇమిగ్రేషన్‌ సమాచారంతో గుర్తించిన 1300 మంది క్వారంటైన్లోనే ఉన్నారని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. (విదేశీ ప్రయాణ చరిత్ర లేని మహిళకు కరోనా..)

మరోవైపు కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నామని, నగరంలో 13 వేల మంది విదేశాల నుంచి వచ్చారని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారైంటెన్ స్టాంప్స్ వేస్తామని, క్వారంటెన్ ఉన్నారా లేదా అనేది కూడా పరిశీలిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఏరియాలో శానిటేషన్ ఎక్కువ చేస్తున్నామని వెల్లడించారు. రేపు పారిశుద్ధ్య సిబ్బంది యథావిధిగా విధులు నిర్వహిస్తారన్నారు. నగర ప్రజలు జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సోడియం, పైతో క్లోరైడ్‌తో స్ప్రేయింగ్ చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే 108 కాల్ చేయాలని, ప్రత్యేకంగా 108 వాహనాలతో వారిని ఆసుపత్రికి తరలిస్తామని లోకేష్‌ కుమార్‌ తెలిపారు. (హీరోయిన్‌కు కరోనా.. బ్రేకప్‌ చెప్పిన ప్రియుడు..!)

కరోనా: ఐదేళ్ల ముందే చెప్పిన బిల్‌ గేట్స్‌!

మరిన్ని వార్తలు