రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది

16 Dec, 2019 03:04 IST|Sakshi

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

సాక్షి, హైదరాబాద్‌: మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్‌లో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ సంస్థలైన ఆర్‌బీఐ, సీబీఐలాంటి సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు త్రిపుర, బెంగాల్‌లో ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయన్నారు. ఈ నెల 19న పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు