జోషి మరణం తీరని లోటు: సురవరం

27 May, 2019 03:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీపీఐ సీనియర్‌ నాయకుడు పీపీసీ జోషి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జోషి ఆదివారం హైదరాబాద్‌లోని పుప్పాలగూడలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానించారు. నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ కూడా మరో ప్రకటనలో జోషి మృతికి సంతాపం ప్రకటించింది. సాహిత్య సంస్థలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడింది. ఆయన మరణం అభ్యుదయ, వామపక్ష వాదులకు తీరనిలోటని పేర్కొంది. జోషి పార్టీలో పలు కీలక బాధ్యతలతోపాటు, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌కు మేనేజర్‌గా, సీపీఐ కేంద్ర కార్యాలయ ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జోషి తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులయ్యారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు