ఏప్రిల్‌ 1నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

26 Mar, 2018 06:37 IST|Sakshi
పోస్టర్లు విడుదల చేస్తున్న సీపీఐ నేతలు

బెల్లంపల్లి : తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఏప్రిల్‌ 1నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్, జిల్లా కార్యదర్శి కె.శంకర్‌ తెలిపారు. ఆదివారం పట్టణ సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ అలుపెరుగని పోరాటాలు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర మహాసభల ప్రారంభాన్ని పురష్కరించుకుని ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరా రు. మహాసభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శులు కె. నారాయణ, అతుల్‌కుమార్‌ అంజన్‌ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చిప్ప నర్సయ్య, డి.సత్యనారాయణ, ఎం.వెంకటస్వామి,  మల్లయ్య, చంద్రమాణిక్యం పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు