కొట్లాటను కోతి పరిష్కరించాలా..

25 Feb, 2015 01:20 IST|Sakshi

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుంకరి వీరయ్య
రాజ్యాంగబద్ధంగా బడ్జెట్ సాధించుకోవాలి
మలుగులో సీపీఎం జిల్లా 18వ మహాసభలు

 
 ములుగు : పిల్లిపిల్లి కొట్టుకుంటే కోతివచ్చి సమస్యను పరిష్కరించేలా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుంకరి వీరయ్య విమర్శించారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టాల ప్రకారం రెండు రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు, నిధులపై సీఎంలు పిల్లుల్లా కొట్లాడుతుంటే కేంద్రం కోతిగా వచ్చి సమస్యను పరి ష్కరిస్తుందా అని ప్రశ్నించారు. ములుగులోని డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్(ఏసీరెడ్డి నర్సింహారెడ్డి ప్రాంగణం)లో మంగళవారం జరిగిన పార్టీ జిల్లా 18వ మహాసభలకు ఆయన ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రాల వాటాపై సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సీఎం లు ఇరురాష్ట్రాల ప్రజలు, పోలీసులు, అధికారులు కొట్లాటకు దిగేంతవరకు చూస్తున్నారని ఆరోపించారు. ఇటు ప్రజా సమస్యలపై పోరాడే బాధ్యత ఆంధ్రాలో టీడీపీకి లేదని, పరిష్కరించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత టీఆర్‌ఎస్‌కు లేదని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న పనులపై ఆంధ్రా ప్రజలు చంద్రబాబును గల్లాపట్టి అడిగే పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాలు కుమ్ములాటలకు సిద్ధమవుతున్నా ప్రధాని నరేంద్రమోదీ పిల్లిజపం చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సోయి ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించుకోవడంపోయి కేంద్రం ముందు తలవంచుకుని బతిమిలాడడమేనని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజలు సిద్ధం కావాలని అన్నారు. దీనికి సీపీఎం మద్దతుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కోటి ఆశలతో టీఆర్‌ఎస్ పార్టీని గెలి పించిన ప్రజ లు.. తొమ్మిది నెలల పాలనలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలీకృతం కాగా ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలకోసమేతప్పా ప్రజా సంక్షేమానికి కాదన్నారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ నేడు మూలాలను పక్కనబెట్టడం సరికాదన్నారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజ లు కమ్యూనిస్టు పార్టీ అరుున సీపీఎం వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు, ప్రణాళికలను ఎప్పటికప్పు డు ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులను సచివాలయంలోకి రానివ్వకుండా నిరోధించడం హక్కులను కాలరాయడమేనని అన్నారు.

ఆప్ గెలుపు.. గొడ్డలిపెట్టు

దేశంలో అతిపెద్ద పార్టీలని విర్రవీగుతున్న ఎన్డీఏ, యూపీఏలకు, వివిధ రాష్ట్రాల్లోని పార్టీలకు ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆప్ గెలుపు గొడ్డలిపెట్టులాంటిందని వీరయ్య అన్నారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. జిల్లా కమిటీ సభ్యుడు వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ఆంధ్రావాళ్లు వారి ప్రాంతాలకు వెళ్తే వ్యవసాయూనికి నిరంతర కరెంటు, ఇంటికో ఉద్యోగం, కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందని మాయమాటలు చెప్పిన ప్రభుత్వ విధానాలు నేడు పక్కదారి పడుతున్నాయని అన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మెట్టు శ్రీనివాస్ మా ట్లాడుతూ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు ఉన్నారని, ఆత్మహత్యలకు పాల్పడ్డ వారిలో వరంగల్ జిల్లా రెండో స్థానంలో ఉందని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ ప్రాజెక్టు కేవలం కార్యకర్తల పొట్టలు నింపేందుకేనని ఆరోపించారు.

ఈ పథకంలో రైతులను భాగస్వాములను చేయూలని కోరా రు. జిల్లా కార్యదర్శి జి.నాగయ్య, కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు కల్లెపు వెంకటయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జ్యోతి, మహాసభల అధ్యక్షవర్గం సభ్యు లు రంగయ్య, కళావతి, దిగిని సమ్మయ్య, వెంకన్న, జిల్లా నాయకుడు తుమ్మ వెంకటరెడ్డి, డివిజన్‌కార్యద ర్శి ఎండీ.అమ్జద్‌పాషాతోపాటు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు