సిటీలో టెస్ట్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి 

17 May, 2020 03:23 IST|Sakshi

మంత్రి ఈటలకు సీపీఎం లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. రాష్ట్రానికి కావాల్సిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌లు, ఇతర మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ ఉచితంగా ఇవ్వాలని కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఎల్‌బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్‌ జోన్‌లలో విస్తృతంగా, కంటైన్‌మెంట్‌లలో భౌతికదూరం, మాస్క్‌లు, పరిశుభ్రత పాటించడంతో పాటు ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేయడం ద్వారానే కరోనా నియంత్రణ సాధ్యమని తమ పార్టీ భావిస్తోందన్నారు. ముఖ్యంగా కార్వాన్‌ నియోజకవర్గంలోని జియాగూడ డివిజన్‌లో జనసాంద్రత ఎక్కువని, 25 రోజుల్లోనే 91 కరోనా పాజిటివ్‌ కేసులు, 8 మంది చనిపోయారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు