ఎస్సార్‌ నగర్‌లో బీభత్సం సృష్టించిన క్రేన్‌

5 May, 2019 16:37 IST|Sakshi

షాపులతో పాటు పలు వాహనాలు ధ్వంసం

సాక్షి, హైదరాబాద్‌ : ఎస్సార్‌ నగర్‌లో ఆదివారం ఓ క్రేన్‌ వాహనం అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా క్రేన్‌కు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో చిరు వ్యాపారుల దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. క్రేన్‌ బీభత్సానికి భయపడిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు.

మరిన్ని వార్తలు