ఆన్‌లైన్‌లోనే క్రైమ్‌ కంట్రోల్‌ రివ్యూ 

31 Oct, 2017 03:42 IST|Sakshi

సీసీటీఎన్‌ఎస్‌ ఎంపవర్‌ కమిటీ భేటీలో డీజీపీ  

సాక్షి, హైదరాబాద్‌: క్రైమ్‌ కంట్రోల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) ప్రాజెక్టు ద్వారా ప్రతీ రోజు, ప్రతీ నెల జరిగే నేరాలు, వాటి నియంత్రణకు సంబంధించి ఎస్పీలు, ఐజీలు, ఇతర అధికారులు ఆన్‌లైన్‌ ద్వారానే రివ్యూ చేసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ అభిప్రాయపడ్డారు. సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు పురోగతిపై ఎంపవర్‌ కమిటీ సోమవారం భేటీ అయ్యింది.

మండల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగే అతి చిన్న నేరాలను సైతం సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు ద్వారా డేటా బేస్‌తో అనుసంధానం చేసుకోవాలన్నారు. దీని వల్ల నేరాల సంఖ్య సమగ్రంగా తెలుస్తుందని వారికి సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు అభివృద్ధిలో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోందని తెలిపారు. చైర్మన్‌ డీజీపీ అనురాగ్‌ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ అదనపు డీజీపీ రవి గుప్తా తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు