ధర్నా చేస్తే క్రిమినల్‌ కేసులు

23 Oct, 2019 08:24 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ వెంకటేశ్వర్లు

బస్టాండ్‌లో కొత్తగా 20 సీసీ కెమెరాల ఏర్పాటు 

ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తాం 

మహబూబ్‌నగర్‌ ఏఎస్పీ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్‌ శాఖ అన్ని రకాల చర్యలు చేపట్టిందని, ప్రజలకు అసౌకర్యం కల్పించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు చట్టానికి లోబడి నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. సమ్మె చేసే ఆర్టీసీ కార్మికులను ఇక ముందు డిపో వద్దకు గానీ, బస్టాండ్‌ గేట్ల వద్దకు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని పేర్కొన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించడం, బస్సుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు హెచ్చరించారు. సమ్మె సందర్భంగా చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. వారిపై నమోదైన కేసు వివరాలను సంబంధిత అధికారులకు పంపుతామని వెల్లడించారు. ఇలాంటి కేసులు నమోదు కావడం వల్ల ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

ప్రత్యేక బలగాల మోహరింపు 
మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇప్పటికే కొన్ని సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, మంగళవారం మరో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ వివరించారు. గొడవ లు సృష్టించి ప్రయాణికులకు ఆటంకం కలిగిం చే వారి వివరాలు నిఘా కెమెరాల ద్వారా ప్రత్యే క సాక్ష్యాలుగా స్వీకరిస్తామన్నారు. సమ్మె చేస్తు న్న ఆర్టీసీ కార్మికులను బస్టాండ్, బస్‌ డిపో పరి సరాల్లోకి అనుమతించమన్నారు. జిల్లాలోని అ న్ని రహదారులపై ప్రత్యేక బలగాల పెట్రోలింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశా ల మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపడుతామని, పోలీ సు బందోబస్తుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డీఎస్పీలు భాస్కర్, సాయిమనోహర్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా