తీలేర్‌లో మొసలి కలకలం 

10 Feb, 2018 18:06 IST|Sakshi
మొసలిని పిల్లలమర్రికి తరలిస్తున్న సిబ్బంది

మరికల్‌ (నారాయణపేట) : మండలంలో ని పర్ధీపూర్‌ చెరువులో నుంచి దారి తప్పి వచ్చిన భారీ మొసలిని  శుక్రవారం తీలేర్‌ గ్రామ రైతులు ప ట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి సమయం లో జాతీయ రహదారి దాటుతున్న మొసలిని గ మనించిన ఓ లారీ డ్రైవర్‌ తన వాహనాన్ని నిలి పి చూస్తుండగా, వెనకలే కారులో వచ్చిన సీఐ శ్రీకాంత్‌రెడ్డి మొసలిని గమనించి రోడ్డును దా టించారు. అనంతరం దాని ఆచూకీ కోసం ప్ర యత్నించగా కనిపించకపోవడంతో చుట్టుపక్క ల గ్రామాల రైతులకు మొసలి సంచరిస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శుక్రవా రం మధ్యాహ్న సమయంలో తీలేర్‌ పెద్ద చెరువు కింద ఉన్న డీసీసీబీ చైర్మన్‌ వీరారెడ్డి వ్యవసాయ పొలం పక్కలే ఉన్న ఓ కాల్వలో నిద్రిస్తున్న మొ సలిని గమనించిన్న రైతులు వెంటనే పోలీసుల కు, అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు వచ్చేలోపు గ్రామస్తులు వలలో మొసలిని బంధించి గ్రామ పంచాయతీ దగరకు తీసుకువచ్చారు. ఎస్‌ఐ జములప్ప గ్రామస్తులు పట్టుకున్న మొసలిని వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మొసలిని గమనించిన బీట్‌ ఆఫీసర్‌ విజయ్‌రాజ్‌ మాట్లాడుతూ రెండేళ్ల వయస్సు, 5 ఫీట్ల పొడవు ఉంటుందన్నారు. దీని మహబూబ్‌నగర్‌ పిల్లలమర్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సవారన్న, ఎంపీటీసీ తిరుతపమ్మ, అశోక్, బసన్న, కుర్మన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 
  

మరిన్ని వార్తలు