భారీ వర్షాలతో పంటలకు నష్టం

23 Aug, 2018 14:55 IST|Sakshi
 మద్నూర్‌ శివారులో నీట మునిగిన పత్తి పంట 

మద్నూర్‌(జుక్కల్‌): వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మొగ్గలు కాస్తున్న సమయంలో భారీ వర్షాలతో పత్తి పంట నీటిలో మునిగిపోయిందని రైతులు కలత చెందుతున్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం పత్తి పంటను సాగుచేస్తున్నారు. గతేడాది గులాబీ రంగు పురుగు, గిట్టుబాటు ధర, అంతంత మాత్రమే వచ్చిన దిగుబడితో నిండా అప్పుల్లో కూరుకుపోయామని రైతులు వాపో యారు. ఈ సారైనా పంట బాగా పండితే అప్పు లు తీర్చుకుందామని రైతులు చర్చించుకుంటున్నారు. అలాగే చేతికొచ్చిన పెసర, మినుము పంటలు బారీ వర్షాలతో నీట మునిగి కుళ్లిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు