పంట రుణాల్లో భారీ దుర్వినియోగం

10 Sep, 2019 12:24 IST|Sakshi
మానుకోట పీఏసీఎస్‌ కార్యాలయం

 పీఏసీఎస్, డీసీసీబీలో అధికారుల తనిఖీలు

వారం రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశాలు

సాక్షి, మహబూబాబాద్‌: మానుకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సుమారు 70 లక్షల రూపాయల పంట రుణాలలో దుర్వినియోగం జరిగినట్లు కొంత మంది రైతులు విలేజ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో  అధికారులు మానుకోట పీఏసీఎస్‌ కార్యాలయంతో పాటు డీసీఓ, డీసీసీబీ బ్యాంక్‌కు వెళ్లి ఆ విషయంపై ఆరా తీశారు. దీంతో వారం రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 18 గ్రామాలు ఉన్నాయి. దానిలో సుమారు 13000 మంది సభ్యులు ఉన్నారు. వారిలో కేవలం 1545 మంది చిన్న, సన్నకారు రైతులు మాత్రమే రుణాలు తీసుకున్నారు. వారికి లక్షలోపు రుణాలు మాత్రమే ఇవ్వడం వల్ల రుణాలు తీసుకున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉంది. 2012లో నాలుగు కోట్లు, 2014లో 7 కోట్లు ఆ తర్వాత 2019 వరకు కేవలం 6 కోట్ల రుణాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని కార్యాలయం సిబ్బంది తెలిపారు.

రుణ విధానం
పీఏసీఎస్‌లో రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, వన్‌బీ, పహానీ వాటి జిరాక్స్‌లతో పాటు ఒరిజినల్‌ పరిశీలిస్తారు. అనంతరం ఆ రైతుల రుణాల విషయంపై పరిశీలించి దానిని బట్టి క్రెడిట్‌ లిమిట్‌ ప్రకారం రుణాలు ఇస్తున్నారు. ఎకరాకు 10వేల నుంచి 20,000 వరకు ఇచ్చిన రైతులే ఎక్కువగా ఉన్నారు. 50,000లోపు రుణాలు ఇచ్చిన రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కువ రుణం కోసం ఇతర బ్యాంకులలో తీసుకున్నారు. డీసీసీబీ మానుకోట శాఖ బ్యాంక్‌లో సుమారు 6 కోట్లు రుణాల వరకు రైతులు తీసుకున్నారని రుణమాఫీ జరిగినప్పుడు దాని ప్రకారం కొత్త రుణాలు ఇచ్చారు. సొసైటీ నుంచి పేర్లు పంపితే బ్యాంక్‌ సూపర్‌వైజర్, మేనేజర్‌ వెరిఫికేషన్‌ చేసి వారి ఖాతాలో జమ చేయాలి.

రుణాల దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదు
మానుకోట పీఏసీఎస్‌ పరిధిలో సుమారు రూ.70 లక్షల రుణాలు దుర్వినియోగం జరిగినట్లు కొంత మంది రైతులు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం విలేజ్‌ అధికారి తిరుపతి మానుకోట పీఏసీఎస్‌ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసినట్లు  సమాచారం. ఆ తర్వాత డీసీసీబీ మానుకోట శాఖ బ్యాంక్‌కు వెళ్లి బ్యాంక్‌ మేనేజర్‌ అశ్రితను కలిసి ఫిర్యాదుపై నివేదిక అందచేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా ఆ పనిలో ఉన్నారు. ఆ రెండు కార్యాలయాలతో పాటు జిల్లా కేంద్రంలోని డీసీఓ కార్యాలయంనకు కూడా వెళ్లి ఆరా తీçశారు. మానుకోట మండలంలోని అమనగల్‌ గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

నిధుల దుర్వినియోగమా.. కాజేశారా..
రూ 70 లక్షల రుణాల డబ్బులు దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదు చేశారు. రైతుల పేరుతో రుణాలు కాజేశారా లేదా ఏదైనా నిధులు విషయంలో దుర్వినియోగం చేశారో తేలాల్సి ఉంది. 2012 నుంచి 2019 వరకు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల కమీషన్‌ డబ్బులు రాగా వాటిని వేతనాలుగా తీసుకున్నామని సిబ్బంది చెబుతున్నారు.  ఆదే నిబంధన కూడా ఉందని తెలిపారు.  బ్యాంక్‌ మేనేజర్‌ సొసైటీ సీఈఓ జియామోద్దీన్‌కు  ఉత్తర్వుల లేఖను పంపి రెండు రోజులలో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

రైతులను ఆరా తీస్తే వాస్తవాలు వెలుగులోకి..
విలేజ్‌ అధికారులు నివేదికతో పాటు అధికారుల నేరుగా సొసైటీ, బ్యాంక్‌ రికార్డులను పరిశీలించి ఆన్‌లైన్‌ నివేదికను తీసుకొని రైతులను ఆరా తీస్తే వాస్తవాలు బయటికి వస్తాయని సభ్యులు అంటున్నారు. కేవలం 1545 మాత్రమే రుణాలు తీసుకున్నారు. మిగిలిన సభ్యులు కూడా ఆందోళనకు గురి అవుతున్నారు. తమ భూములకు సంబంధించిన పత్రాలు కూడా సొసైటీలో ఉన్నాయని తమ పేరున రుణాలు తీసుకున్నారా అనే టెన్షన్‌ వారిలో మొదలైంది. విలేజ్‌ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయని అంటున్నారు. రుణాల విషయంతో పాటు వాటికి విడుదలైన నిధులు, ధాన్యం కొనుగోళ్ల  కమీషన్‌ అన్ని విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కోరుతున్నారు. మానుకోట మండలం మల్యాల పీఏసీఎస్‌ విషయంలో పెద్ద ఎత్తున్న ని««ధుల దుర్వినియోగం జరిగి మూత పడింది. అందులో జరిగిన అవినీతి నేటికి పూర్తి స్థాయిలో బయట పడలేదు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

ఈనాటి ముఖ్యాంశాలు

‘కేసీఆర్‌.. ఫ్రంట్, టెంట్ ఎక్కడ పోయింది?’

‘తప్పు చేస్తే ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాం’

కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదు: కేసీఆర్‌

పీఏసీ చైర్మన్‌గా అ‍క్బరుద్దీన్‌ ఒవైసీ

ఆఖరి మోఖా!

18 గంటలుగా సెల్‌ టవర్‌పైనే..

మోగిన ఉప ఎన్నిక నగారా !

నీలగిరితోటల్లో పులి సంచారం

జే7 ఫోన్‌ పేరుతో మోసం చేసిన యువతి

‘మేడిగడ్డపై అడ్డగోలు మాటలు’

గరం..గరం చాయ్‌; గాజు గ్లాస్‌లోనే తాగేయ్‌..

కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు 

అక్క ప్రేమను ఒప్పుకున్నారు.. కానీ చెల్లి ప్రేమను

నాగార్జున సాగర్‌ గేట్లు మూసివేత

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ: అందుకు మోదీ కారణం

వామ్మో.. మొసలి

హరిత ప్రణాళికలు సిద్ధం

ఉద్యోగాలన్నీ పచ్చగా..

ప్రాణం మీదకు తెచ్చిన  టిక్‌టాక్‌

ఎన్ని పీతలు ఏకమైనా మమ్మల్నేమీ చేయలేవు

నేటితో బడ్జెట్‌ సమావేశాల ముగింపు

చాయ్‌ తాగుతవా? అని అడుగుతోంది!

సచివాలయం ఫైళ్లన్నీ భద్రం

రాష్ట్రానికి 3 జాతీయ జల మిషన్‌ అవార్డులు 

అందరికీ నాణ్యమైన విద్య: సబిత

ప్రభుత్వ ఘనత దేశమంతా తెలియాలి

రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల వర్షాలు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌

‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’

బిగ్‌బాస్‌లో.. గద్దలకొండ గణేష్‌

బాలీవుడ్ జేజమ్మ ఎవరంటే?

చిత్ర పరిశ్రమ చూపు.. అనంతపురం వైపు!