రుణమాఫీకి రూ.2,019 కోట్లు

9 Nov, 2016 04:12 IST|Sakshi

మూడో విడతలో రెండో సగం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
వచ్చే ఏడాది ఒకేసారి ఆఖరి విడత చెల్లింపునకు యోచన

 
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడో విడతకు సంబంధించిన రెండో సగం నిధులు రూ.2,019.19 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులకు సంబంధించి మూడు వంతుల రుణాన్ని ప్రభుత్వం తిరిగి బ్యాంకులకు చెల్లించినట్లైంది. మొత్తం 36 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాల మాఫీ పథకాన్ని టీఆ ర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. 4 విడతల్లో మాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

తొలి ఏడాది రూ.4,250 కోట్లు ఒకే సారి విడుదల చేసింది. గతేడాది జూన్, సెప్టెంబ ర్‌లో 2 దశల్లో రూ.4,086 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది నిధుల విడుదల  ఆలస్యమైంది. జూలై 1న మొదటి దఫాగా రూ.2,019 కోట్లు చెల్లిం చింది. 3 నెలల తర్వాత మిగతా రూ.2,019 కో ట్లు విడుదల చేసింది. వచ్చే ఏడాది నాలుగో విడ త చెల్లింపులతో ఈ పథకం ముగియనుంది. బ్యాంకులకు నిధులు చేరటం ఆలస్యమవటంతో కొన్ని జిల్లాల్లో బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లు విమర్శలు చుట్టుముట్టారుు. అందుకే వచ్చే ఏడాది చివరి విడత నిధులను ఒకేసారి విడుదల చేయాలని ఇటీవలే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
 
లెక్కతేలింది రూ.16,160 కోట్లు..
రైతు రుణమాఫీకి సంబంధించిన లెక్కతేలింది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆరంభంలో ప్రకటించింది. 36 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ పథకం అమల్లో భాగంగా రెండో ఏడాది బోగస్ రైతులు, రెండేసి ఖాతాలున్న రైతులు కొందరిని ప్రభుత్వం ఏరివేసింది. దీంతో మాఫీ మొత్తం రూ.16,160 కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ తాజాగా అంచనాకు వచ్చింది. ఇప్పటివరకు  రూ.12,375 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మొత్తం 35.30 లక్షల రైతుల రుణాలు మాఫీ అయ్యాయని, బ్యాంకుల బ్రాంచీల వారీగా లబ్ధిదారుల జాబితాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మిగతా రూ.3,785 కోట్లు విడుదల చేస్తే ఈ పథకం సంపూర్ణంగా విజయవంతమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారుు.
 
 దశలవారీగా చెల్లింపులు
 2014 సెప్టెంబర్:     రూ.4,250 కోట్లు
 2015 జూన్:        రూ.2,043 కోట్లు
 2015 జూలై:        రూ.2,043 కోట్లు
 2016 జూలై:        రూ.2,019 కోట్లు
 2016 నవంబర్:    రూ.2,019 కోట్లు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎన్‌కౌంటర్‌కు ప్లాన్‌

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

గ్రామాభివృద్ధికి సహకరించాలి :జిల్లా కలెక్టర్‌

‘నేను పార్టీ మారడం లేదు’

స్టూడెంట్‌ పోలీస్‌తో దురాచారాలకు చెక్‌!

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

‘విదేశీయుల’పై నజర్‌!

బాడీ బిల్డర్స్‌కు మంత్రి తనయుడి చేయూత

‘న్యాక్‌’ ఉండాల్సిందే!

గ్రేటర్‌లో నకిలీ పాలసీల దందా

వాహనం ఢీకొనడంతో.. అంధకారంలో 20 గ్రామాలు!

ఒకటా మూడా?

కలుషిత ఆహారం తిన్నందుకు....

పోలీస్‌ @ అప్‌డేట్‌

హైదరాబాద్‌కు 48 రోజులే నీళ్లు అందించగలరా?

హామీలను సీఎం నిలబెట్టుకోవాలి

సర్కారు బడికి.. సర్పంచ్‌ కుమార్తె..

కాకతీయుల స్థావరాలు

ఒరిగిన బస్సు.. తప్పిన ముప్పు

బెంబేలెత్తిస్తున్న గ్రామ సింహాలు

రోడ్డు ప్రమాదంలో సబ్‌ ఇంజనీర్‌ మృతి

తాగడానికే నీళ్లులేవు.. మొక్కలు ఎలా పెంచాలి?

లెక్క తేలలేదు..

కొత్వాల్‌ కొరడా..! 

సెల్‌టవర్‌ బ్యాటరీ దొంగల అరెస్ట్‌

‘డిజిటల్‌’ కిరికిరి! 

113 మందిపై అనర్హత వేటు 

టీఆర్‌ఎస్‌కు మావోయిస్టుల హెచ్చరిక

వివాదాస్పదంగా బిగ్‌బాస్‌

ఏసీబీకి చిక్కిన ఐఐటీ టాప్‌ ర్యాంకర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!