పంట నష్టపోయిన  రైతుకు పరిహారమివ్వాలి

12 Jan, 2019 04:05 IST|Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని 

సాక్షి, హైదరాబాద్‌: పంటలకు అవసరమైన నీటిని ప్రణాళికాబద్ధంగా అందించాలని, నీరు లేక ఏ రైతు పంట నష్టపోయినా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వర్షాభావంతో ఖరీఫ్‌ పంటలు దెబ్బతిన్నాయని, రబీపై ఆశలు పెట్టుకున్నా.. నాగార్జునసాగర్‌ ఎడమకాలువ, శ్రీరాంసాగర్, జూరాల కింది రైతులకు తైబందీ చేసి నీరివ్వడం లేదన్నారు. నాగార్జునసాగర్‌ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వేసిన పంటలకు ఇవ్వాల్సిన నీటిని మిషన్‌ భగీరథకు తరలించడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే వేసిన పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సాగర్‌లో డెడ్‌స్టోరేజీ పోగా 60 టీఎంసీల నీరు ఉన్నందున.. సాగర్‌ బోర్డును సంప్రదించి రాష్ట్రంలోని మొదటి, రెండో జోన్లకు కావాల్సిన నీటిని సాధించాలన్నారు. శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీ పోగా 30 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున, ఇందులో రాష్ట్రానికి రావాల్సిన కోటా రాబట్టాలని కోరారు. ఇప్పటికైనా నీటిపారుదల, వ్యవసాయశాఖలు నీటి లభ్యతను బట్టి ఆయకట్టు ప్రాంతాన్ని నిర్ధారించి కచ్చితంగా అమలుచేయాలని తమ్మినేని సూచించార 

మరిన్ని వార్తలు