రైతుల ఆందోళన కనపడదా: డీకే అరుణ

9 Nov, 2017 03:41 IST|Sakshi

పంటలు కొనుగోలు చేసేవారు లేక రైతులు ఆందోళన పడుతున్నారని, రైతుల గోస టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కనపడదా అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రశ్నించారు.  రైతును రాజు చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. వేరుశనగ ధర గతేడాది ఇదే సమయంలో క్వింటాలుకు రూ.4,600 ఉందని, ఇప్పుడు గద్వాల మార్కెట్‌లో రూ.1,600కే కొంటున్నారని అన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు