కోవిడ్‌ ఎఫెక్ట్‌: వారి కోసం ‘క్రౌడ్‌ ఫండింగ్‌’

26 Mar, 2020 10:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో 20 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. దీనితో రోజువారీ వేతనాల మీద ఆధారపడిన వారు, చిరువ్యాపారులు... ఇంకా అనేకమంది తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకోవడానికి ప్రముఖ క్రౌడ్‌ ఫండింగ్‌ సంస్థ మిలాప్‌ ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ హైదరాబాద్‌ నగర ప్రతినిధులు తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా milaap.org/covid19 పేజీని ఏర్పాటు చేశామని, దీని ద్వారా సేకరించిన నిధులను అవసరార్థుల కోసం, చిన్న చిన్న ఆసుపత్రుల్లో వసతుల కోసం వినియోగిస్తామని వివరించారు. (రానున్న మూడు వారాలే అత్యంత కీలకం)  


రాచకొండలో కోవిడ్‌–19 కంట్రోల్‌ రూమ్‌

రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సైతం బుధవారం అత్యవసర వేవల్ని అందించే వర్తక, వాణిజ్య, సేవల రంగాలకు చెందిన వారితో భేటీ అయ్యారు. వారికి ఉన్న ఇబ్బందులు, అవసరమైన సహాయ సహకారాలను చర్చించారు. కమిషనరేట్‌ పరిధిలోని వారి కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా కోవిడ్‌–19 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 100తో పాటు 94906 17234, 94906 17111 నంబర్లలో వాట్సాప్‌ ద్వారా సంప్రదించాలని కోరారు. (అత్యవసర సేవలకు పాసుల జారీ)

పోలీసుల కడుపునింపుతున్న అన్నదాత
హిమాయత్‌నగర్‌: 24 గంటల పాటు తిండీ, ఆహారాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అన్నదానం చేస్తున్నాడో వ్యక్తి. ‘నారాయణి’ జ్యూవెలరీస్‌ అధినేత అమిత్‌ అగర్వాల్‌ నారాయణగూడ పోలీసుల కడుపు నింపుతున్నాడు. మధ్యా హ్నం, రాత్రి భోజన సదుపాయాన్ని అందిస్తున్నాడు. రోటీ, చపాతి, పప్పు, ఇతర ఆకు కూరగాయలతో చేసిన కూరలతో సుమారు ప్రతిరోజూ 100 మందికి పైగా అన్నదానం చేయడం విశేషం. (కోవిడ్‌ ముట్టఢీ రాష్ట్రాల కట్టఢీ)

>
మరిన్ని వార్తలు