గ్యాంగ్రేప్: నిందితులు అరెస్ట్

22 May, 2016 08:59 IST|Sakshi

-మరో ఇద్దరు పరారీలో..


శంషాబాద్ : యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను శంషాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మండలంలోని ముచ్చింతల్ గ్రామానికి చెందిన పాండు, పద్మమ్మ కుమార్తె (23) ను అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఈ నెల 15న ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఇంటి సమీపంలో ఉండే వీఆర్‌ఓ చంద్రమోహన్ తనను గత మార్చి 5న ఇంటికి పిలిచి మరో ముగ్గురుతో కలిసి సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.

ఈ మేరకు నిందితులు చంద్రమోహన్, మహేందర్ అలియాస్ మహేష్, అల్లం శేఖర్, జిత్తు అలియాస్ జితేందర్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. శనివారం నిందితులు అల్లం శేఖర్, జిత్తును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మరో ఇద్దరు నిందితులు చంద్రమోహన్, మహేందర్ పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు