భైంసాలో కొనసాగుతున్న కర్ఫూ

11 May, 2020 13:18 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌: భైంసాలో ఆదివారం రాత్రి జరిగిన అల్లర్లతో పట్టణంలో 24 గంటల కర్ఫూ కొనసాగుతోంది. ఈ అల్లర్లలో ఇద్దరికి గాయాలు కాగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారి పరిస్థితి విషమించడంతో నిజమాబాద్ ఆసుపత్రికి తరలించారు. అల్లర్లకు దిగిన ఇరువార్గాలు ఒక బైక్‌‌ను తగలబెట్టగా, ఒక కారు, ఆటోను ధ్వంసం చేశారు. ఇరు వార్గాలు పలు ఇళ్లపై రాళ్లు విసిరారు. అల్లర్ల సంఘటన స్థలాన్ని కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్‌ సోమవారం పరిశీలించారు. 

భైంసాలో  ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు తెలిపారు. ఇప్పటి వరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. అల్లర్లపై నాలుగు కేసులు నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. భైంసా పట్టణం అంత 144 సెక్షన్ అమలు చేసి పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.  భైంసాలో భారీ బందోబస్తు కొనసాగుతుందని, లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ శశిధర్ ‌రాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు