అదనంగా జీఎస్టీ వసూలు చేస్తే చర్యలు

26 Oct, 2017 01:49 IST|Sakshi

సీవీ ఆనంద్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్యాక్‌ చేసిన సరుకుల మీద వినియోగదారుల నుంచి ఎంఆర్‌పీ కన్నా అదనంగా జీఎస్టీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల కమిషనర్‌ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా పన్నుల పేరుతో వాస్తవ ధర కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం తూనికలు, కొలతల శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సీవీ ఆనంద్‌ సమీక్ష నిర్వహించారు.

గురువారం హైదరాబాద్‌లోని వర్తక, వ్యాపారు లతో సమావేశం నిర్వహించాలని అధికా రులను ఆదేశించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, వీరు గురువారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేస్తారని తెలిపారు. పౌరసరఫరాల శాఖ వాట్సాప్‌ నంబర్‌ 7330774444తో పాటు తూనికల కొలతల శాఖకు చెందిన 7386136907, 27612170 నంబర్లలో,  ఛి ఝ్టటఃnజీఛి.జీn వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చన్నారు.
 

మరిన్ని వార్తలు