బ్యాంకు ఖాతా నుంచి రూ.28,600 స్వాహా

8 Feb, 2020 08:29 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రంలో మరో సైబర్‌ మోసం శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో ఇద్దరు వ్యక్తులకు.. ‘బ్యాంకు మేనేజర్‌ ను మాట్లాడుతున్నాను.. మీ బ్యాంకు ఖా తాను పరీక్షించాల్సి ఉంది, మీ ఏటీఎం కార్డు బ్లాక్‌ అయ్యింది. పిన్‌ నెంబర్‌ చెప్తే సరిచేస్తామ ని చెప్పి, వారి బ్యాంకు ఖాతాల్లోంచి రూ. 28,600 తస్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలో విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి మనోహర్‌కు శుక్రవారం జగిత్యాలలో ని అశోక్‌నగర్‌ బ్యాంకు మేనేజర్‌ను అంటూ, ఏటీఎం కార్డు బ్లాక్‌ అయ్యిందని, పిన్‌ నెంబర్‌ చెప్పమనగానే మనోహర్‌ తన ఏటీఎం కార్డు పిన్‌ నెంబర్‌ చెప్పగానే, అంతలోనే ఖాతా నుంచి రూ.3700 డ్రా అయినట్లు మేసేజ్‌ వచ్చింది.

మళ్లీ మనోహర్‌కు ఫోన్‌ చేసి మరో ఏటీఎం కార్డు పిన్‌ నెంబర్‌ చెప్తే, మీ ఏటీఎం కార్డు పనిచేస్తుందని చెప్పగానే, మనోహర్‌ అక్కడే ఉన్న కొమ్ముల శ్రీనివాస్‌ అనే మేస్త్రీ ఏటిఎం పి న్‌ నెంబర్‌ చెప్పడంతో ఆయన ఖాతాలోంచి రూ.24,900 డ్రా అయినట్లు మేసేజ్‌ వచ్చింది. దీంతో తాము మోసపోయామని గ్రహించి వెంటనే బ్యాంకులో సంప్రదించి, అనంతరం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సెల్‌ నెంబర్‌ 9064666265పై ఫిర్యాదు చేశారు. 

>
మరిన్ని వార్తలు