సెరిలాక్‌ వయసులోనే.. సెల్‌ఫోన్లా!

17 Mar, 2017 03:34 IST|Sakshi
సెరిలాక్‌ వయసులోనే.. సెల్‌ఫోన్లా!

నెట్‌వర్క్, టెక్నాలజీ, సోషల్‌ మీడియాలతో పక్కదారి
దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది ఆన్‌లైన్‌ వేధింపుల నిందితులు
‘ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపుల నియంత్రణ’ సదస్సులో వక్తలు
సైబర్‌ నేరాల నియంత్రణకు కృషి చేస్తాం: హోంమంత్రి నాయిని


సాక్షి, హైదరాబాద్‌: సెరిలాక్‌ తినాల్సిన వయసులోనే సెల్‌ఫోన్లు పట్టుకోవడం వల్లే చిన్నారులకు ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులు మొదలయ్యాయని, నెట్‌వర్క్, టెక్నాలజీ, సోషల్‌ మీడియాతో పక్కదారి పడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా నేతృత్వంలో గురువారం ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో జరిగిన ‘ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ’ సదస్సును హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారం భించారు.

టెక్నాలజీ, సోషల్‌ మీడియాలను సరైన రీతిలో ఉపయోగించుకోకపోవడం వల్లే చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్నారు లపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, సైబర్‌ నేరస్థులను కట్టడి చేయడంలో సీఐడీ సఫలీకృతమవుతోందని నాయిని ప్రసంశిం చారు.  ఈ సందర్భంగా సీఐడీ రూపొందించిన లైంగిక వేధింపుల నియంత్రణ మాడ్యుల్‌ను ఆవిష్కరించారు.

తల్లిదండ్రుల పర్యవేక్షణలో నియంత్రణ
పోలీసులు, చట్టాలు, స్వచ్ఛంద సంస్థలు.. ఇలా ఎన్ని ఉన్నా పిల్లలపై జరుగుతున్న లైం గిక వేధింపుల నియంత్రణలో కీలక పాత్ర తల్లి దండ్రులదేనని తులిర్‌ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విద్యారెడ్డి స్పష్టంచేశారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తాము చేసిన సర్వే ప్రకారం సెక్సువల్‌ ఎడ్యు కేషన్‌ పాఠ్యాంశంగా ఉందని, అయితే దేశంలో ఇప్పుడిప్పుడే ఈ అంశంగా చేర్చే ప్రక్రియ ప్రారంభంలో ఉందన్నారు. బిహార్‌లోని పట్నా రైల్వేస్టేషన్‌లో ఉచితంగా వైఫై ఇవ్వడంతో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలు డౌన్‌లోడ్‌ చేసినట్లు అక్కడి పోలీసుల దర్యా ప్తులో బయటపడిందన్నారు.

 దీంతో అక్కడ వైఫై సేవలు రద్దు చేశారన్నారు. పోర్న్‌ వెబ్‌ సైట్లు, సంబంధిత సోషల్‌ మీడియాను వీక్షిం చవద్దని తెచ్చే ఒత్తిడి వల్ల పిల్లల్లో మానసిక వేదన ప్రారంభమై, వాటిని చూసేలా ప్రేరేపి స్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి వెబ్‌సైట్లు వీక్షించడం వల్ల వచ్చే ప్రమాదాలను తెలపడం, అవగాహన కల్పించడం వల్ల, పిల్లల్లో స్వీయ నియంత్రణ అలవ డుతుందని తెలిపారు. ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే పిల్లలకు ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించ గలరని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు