ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు : డీకే

6 Jul, 2014 03:55 IST|Sakshi

గద్వాల/న్యూటౌన్: గద్వాల మండలం కాకులారం గ్రామానికి చెందిన నారాయణ, దేవమ్మలకు నలుగురు మగపిల్ల లు, నలుగురు ఆడపిల్లలు. వీరిలో అందరికన్నా పెద్దవాడు బండారి భాస్కర్. వారిది పేద దళితకుటుంబం. ఆయన జన్మించక ముందే గ్రా మంలో ఉపాధి కోసం ఆ కుటుంబం కర్నూలుకు వెళ్లింది. అక్కడే భాస్కర్ జన్మించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏడో తరగతి వరకు చదివిన భాస్కర్ కర్నూలులోనే చదువుకున్నా డు. వీరికి నాలుగెకరాల పొలం ఉంది. భా స్కర్ పెరిగి పెద్దవాడయ్యాక తిరిగి కుటుం బం ఆ గ్రామానికి కుటుంబం చేరుకుంది. అ ప్పటి నుంచి భాస్కర్ వ్యవసాయం చేయడం తో పాటు తరచూ కర్నూలుకు వెళ్లి రైల్వేవ్యాగన్ హమాలీగా పనిచేశాడు. భాస్కర్‌కు భార్య లక్ష్మిదేవి, కుమార్తె భారతి, కుమారుడు భరత్ ఉన్నారు. వీరిద్దరూ గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు.
 
 రాజకీయ వారసత్వంతో..
 భాస్కర్ తండ్రి నారాయణ 1980 నుంచి రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయనకు ఇప్పటికీ ప్రజల్లో మంచిపేరు ఉం ది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భాస్కర్ రైల్వే హమాలీగా పనిచేస్తూనే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించారు.
 
 ఈ క్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వెన్నంటే ఉన్నాడు. 2001 నుంచి 2006 వరకు భాస్కర్  కాకులారం గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశాడు. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన గద్వాల జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందాడు. అనూహ్య రాజకీయ పరిణామాలతో జెడ్పీచైర్మన్‌గా ఎన్నికై క్యాబినేట్ హోదాను అధిగమించారు.
 
 పదవికి వన్నెతెస్తాడు.
 మా కొడుకు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఉన్నదాంతోనే సంతృప్తిపడుతూ సర్పంచ్‌గా ఊరికి సేవలందించాడు. నేడు జెడ్పీ చైర్మన్‌గా జిల్లాలోని అన్ని పల్లెలను అభివృద్ధి చేసే అదృష్టం వచ్చింది. పదవి ఆశయాన్ని నెర వేరుస్తాడన్న నమ్మకం ఉంది. కష్టపడి పనిచేసే కొడుకు పల్లెప్రజల అభిమానాలు పొందుతాడు. ఏం చేసినా వాడు మంచే చేస్తాడనే నమ్మకం ఉంది.                
 - దేవమ్మ, నారాయణ, భాస్కర్ తల్లిదండ్రులు
 
  ఊహించలేదు..
 నా భర్త గ్రామానికి తన తండ్రి మాదిరిగా సర్పంచ్ అయి సేవలందించాడు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం ఊహించలేదు. ఇంతపెద్ద పదవి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాలాంటి పల్లెలకు ఆయన సేవలు అందిస్తాడు.          
  - లక్ష్మీదేవి, భాస్కర్ సతీమణి
 

మరిన్ని వార్తలు