6న టీఆర్ఎస్లో చేరనున్న డీ.శ్రీనివాస్

1 Jul, 2015 12:44 IST|Sakshi
6న టీఆర్ఎస్లో చేరనున్న డీ.శ్రీనివాస్

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్లో చేరనున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన అధికారికంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. డీ.శ్రీనివాస్ బుధవారం కేసీఆర్తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎస్...కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాసే యోచనలో ఉన్నారు.

మరోవైపు కేసీఆర్తో డీఎస్ భేటీ కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయం నుంచి డీఎస్ నేరుగా నిజామాబాద్ వెళ్లనున్నారు. జిల్లాలోని అనుచరులతో ఆయన మూడురోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారు. కాగా డీఎస్కు ఎలాంటి పదవి ఇస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.

 

మరిన్ని వార్తలు