ఆ రెండు గంట‌ల్లోనే ట‌పాసులు కాల్చాలి: దాన‌కిషోర్‌

5 Nov, 2018 19:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దీపావ‌ళి పండగ సందర్భంగా బాణాసంచా, ప‌టాకులను కాల్చడానికిగాను సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల‌ను పాటించాల‌ని న‌గ‌ర‌వాసుల‌కు  జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం. దాన‌కిషోర్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ర‌హ‌దారులు, జ‌న సంచారం ఉన్న మార్గాల్లో భారీ శ‌బ్దాన్ని క‌ల‌గ‌జేసే ట‌పాసులను పేల్చడాన్ని పూర్తిగా నిషేధించిన‌ట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు. 

అయితే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ‌లి నిర్ధారించిన పొగ‌, శ‌బ్ద పరిమితిలో దీపావ‌ళి పండుగ రోజు రాత్రి 8గంట‌ల నుండి 10గంట‌ల‌లోపు మాత్రమే ట‌పాసుల‌ను కాల్చాల‌ని దాన‌కిషోర్ స్పష్టం చేశారు. దీపావళి సందర్భంగా బాణాసంచాను నిషేధించాలంటూ దాఖ‌లైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ మేర‌కు తీర్పును వెలువ‌రిస్తూ ఆదేశాల‌ను జారీచేసింద‌ని ఆయన పేర్కొన్నారు. టపాసులు కాల్చేముందు త‌గిన భ‌ద్రత చ‌ర్యలు చేపట్టాల‌ని ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు