‘రికార్డు’ నృత్యం   

16 Aug, 2018 14:55 IST|Sakshi
వీక్షిస్తున్న సినీనటుడు సుమన్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ

ఒకే వేదికపై ఎనిమిది రకాల నృత్యాలు

ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు సుమన్‌

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డికి చెందిన ప్రముఖ నృత్యకారుడు ప్రతాప్‌గౌడ్‌ వరల్డ్‌ రికార్డు కోసం బుధవారం సాయంత్రం స్థానిక సత్యగార్డెన్‌లో తెలంగాణ కళావీణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటుడు సుమన్, అతిథులుగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత హాజర య్యారు. ప్రతాప్‌ గౌడ్‌ భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, మోహిని అట్టం తదితర ప్రముఖ కళా నృత్య రీతులలో ప్రదర్శన ఇచ్చారు.

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, జీనియస్, గోల్డెన్‌ వరల్డ్‌ రికార్డుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రతాప్‌గౌడ్‌ తెలిపారు. జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధి బింగి నరేశ్‌ పాల్గొని వివరాలు నమోదు చేశా రు. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విచ్చేసిన ప్రము ఖ యాంకర్లు అభి, సుదీపలు తమ యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతాప్‌గౌడ్‌ శిష్యులు తెలంగాణ ఉద్యమం, మిషన్‌ భగీరథ, రైతుల కష్టాలు తదితర అంశాలపై నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌ వెంకటేశ్‌ ధోత్రే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముజీబొద్దీన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంపత్‌గౌడ్, కౌన్సిలర్‌ సంగిమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు