ఫిట్‌‘లెస్‌’ బస్సులతో ప్రమాదం

1 Jun, 2018 09:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తూప్రాన్‌ మెదక్‌ : జిల్లాలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతూ ధనర్జానే ధ్యేయంగా పనిచేస్తూ, చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా తమ వద్ద అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని గొప్పలు చేబుతూ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. స్కూల్‌ బస్సులకు ఫిట్‌ నేస్‌ పరీక్షలు నిర్వహించడంలో రవాణా శాఖ నిర్లక్ష్యం చేస్తోంది.

ప్రైవేటు విద్యా సంస్థలు కాలం చెల్లిన బస్సులు నడుపుతున్నా , రవాణాశాఖాధికారులు వాటిని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు మెదక్‌ జిల్లా మాసాయిపేట రైల్వే ప్రమాద ఘటనే ఉదహరణ. జిల్లాలో 343 బస్సుల్లో కేవలం 109 బస్సులకు మాత్రమే ఫీట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. 

ఆదేశాలు బేఖాతరు..

పాఠశాలలకు వేసవి సేలవులు ప్రకటించిన తర్వాత ఏప్రిల్‌ చివరి వారం నుంచి మే నెల 15 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, ఇంతవరకూ వాటి ఊసుమరిచారు. 15 ఏళ్లు నిండిన విద్యా సంస్థల బస్సులను సీజ్‌ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కానీ జిల్లాలో మాత్రం ఒక్క బస్సును కూడా ఇప్పటి వరకు సీజ్‌ చేయకపోవడం గమనార్హం. 

అధికారుల ఉదాసీనత..

గతేడాది జిల్లాలో విద్యాసంస్థల బస్సులు ప్రమాదానికి గురైన సంఘటనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు కాలం చెల్లిన బస్సులపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు చెందిన కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు కొనుగోలు చేసి, ప్రస్తుతం వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు.

ఈ వాహనాల్లో కొన్ని కాలం చెల్లినవి ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  అయితే ప్రైవేట్‌ వ్యక్తులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్‌ను చెల్లించకుండా స్కూల్‌ బస్సులను స్కూల్‌ పేరుమీదనే రవాణా శాఖకు పన్నులు కడుతున్నారు.  బస్సు ఫిట్‌నెస్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌లో వాహన యాజమాని పేరు, విద్యార్థుల సంఖ్య, రక్తనమూనా, డ్రైవర్‌ వివరాలు నమోదు చేయాలి.

అలా నమోదు చేసి రవాణాశాఖ నుంచి ఫిట్‌నెస్‌ పత్రాలు తీసుకోవాల్సిన ఉంటుంది. కాని ఎవరు నిబంధనలు పాటించడంలేదన్న విషయం తెలిసింది.కొత్తగా జారీ అయిన మార్గదర్శకాలు..విద్యాసంస్థల వాహనాలపై తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా రవాణా శాఖ మోటారు వాహన చట్టం 1989 ప్రకారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలను ప్రతి విద్యాసంస్థ తప్పకుండా పాటించాల్సి ఉన్నప్పటికీ కాని ఏ సంస్థ పాటించడం లేదాని తేలుస్తోంది. 

నూతన నిబంధనలు

æ    విద్యాసంస్థకు చెందిన బస్సుపై పాఠశాల పేరు, టెలిఫోన్‌ నంబర్, సెల్‌ నెంబరుతో సహా పూర్తి చిరునామాను బస్సుకు ఎడమవైపున ముందు భాగంలో స్పష్టంగా రాయాలి.
æ    బస్సును ప్రిన్సిపాల్, విద్యార్థుల కమిటీ నెలకొకసారి పరీక్షలు చేయాలి. వాహనం కండీషన్, పనితీరు గురించి తెలుసుకోవాలి. 
æ    ఏ విద్యాసంస్థ బస్సు కూడా పరిమితి సీట్ల కన్నా ఎక్కువ మందిని తీసుకెళ్లరాదు.   
æ    ప్రతి బస్సులో అటేండర్‌( సహయకుడు) తప్పనిసరిగా ఉంచాలి  
æ    విద్యా సంస్థల బస్సులకు నియామకమయ్యే డ్రైవర్‌కు 60 ఏళ్లు నిండి ఉండరాదు. ప్రతి డ్రైవర్‌ ఆరోగ్య పట్టికను బస్సులో పెట్టాలి. అతనికి ప్రతి మూడు నెలలకు ఒకసారి బీపీ, షుగర్, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను యాజమాన్యం నిర్వహించాలి.
æ    డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న వ్యక్తినే బస్సు డ్రైవర్‌గా నియమించాలి. అతనికి అయిదేళ్ల బస్సు నడిపిన అనుభవం ఉండాలి. చర్యలు తీసుకుంటున్నాం 
జిల్లా వ్యాప్తంగా 343 ప్రైవేట్‌ స్కూల్స్‌ బస్సులు ఉన్నాయి. ఇందులో 109 బస్సులకు ఫీట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరో 234 బస్సులకు ఫీట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. నేటి(శుక్రవారం) నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాం. అనుమతులు లేని బస్సులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.

–గణేష్, జిల్లా ఆర్టీఏ అధికారి 

మరిన్ని వార్తలు