చీఫ్‌ విప్‌గా దాస్యం వినయభాస్కర్‌ 

8 Sep, 2019 03:01 IST|Sakshi

విప్‌లుగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు అవకాశం 

12 శాసనసభ కమిటీల చైర్మన్లు, సభ్యుల పేర్లు ఖరారు 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌ విప్, విప్‌ల జాబితాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం ఖరారు చేశారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను చీఫ్‌విప్‌గా నియమించారు. గత ప్రభుత్వంలో విప్‌లుగా పనిచేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను మరోమారు విప్‌లుగా కొనసాగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీరితోపాటు అచ్చంపేట, శేరిలింగంపల్లి, చెన్నూరు, పినపాక ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, బాల్క సుమన్, రేగ కాంతారావులను విప్‌లుగా నియమించారు. వినయ భాస్కర్, గాంధీ మంత్రి పదవులు ఆశిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, తాజా నియామకాలతో వారికి మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం కనిపించడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన గెలుపొందిన కాంతారావు ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. చీఫ్‌ విప్, విప్‌ల నియామకాల్లో సామాజికవర్గాల సమతుల్యత, ఉద్యమ నేపథ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. 

సభాకమిటీలు కూడా ఖరారు.. 
శాసనసభ, మండలి సభ్యులతో కూడిన సభాకమిటీల ఏర్పాటుపై కూడా సీఎం కేసీఆర్‌ కసరత్తు పూర్తి చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కమిటీ చైర్మన్లుగా, మరికొందరు ఎమ్మెల్యేలు కమిటీ సభ్యులుగా నియమితులయ్యే అవకాశముంది. ఈ మేరకు ఏయే కమిటీకి ఎవరు చైర్మన్, సభ్యులుగా ఉండాలో కూడా సీఎం కేసీఆర్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, ఈ నెల 9న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఫైనాన్స్‌ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, సంఖ్యాబలం పరంగా కమిటీలన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌ సభ్యులే ఏకపక్షంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 

మండలి చీఫ్‌విప్‌గా బోడకుంటి వెంకటేశ్వర్లు 
శాసనమండలి చీఫ్‌విప్‌గా బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్‌లుగా కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, టి.భానుప్రసాదరావు, కర్నె ప్రభాకర్‌లను నియమిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పేర్లను శనివారం సాయంత్రం ఖరారు చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త గవర్నర్‌  బాధ్యతల స్వీకరణ నేడు

బీసీ గురుకులాల్లో కొలువులు

విష జ్వరాలకు  కేరాఫ్‌గా తెలంగాణ: లక్ష్మణ్‌

నా పేరు నరసింహన్‌

సాగునీటికి కత్తెర..

‘అసైన్డ్‌’  లెక్కేంటి?

కేబినెట్‌లోకి ఆరుగురు

విస్తరణకు వేళాయే..హరీశ్‌కు ఛాన్స్‌!

యాదాద్రి : కేసీఆర్‌ బొమ్మపై వెనక్కు తగ్గిన ప్రభుత్వం

ముగిసిన టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం

ఈనాటి ముఖ్యాంశాలు

మురికి గుంతలో 48 గంటలుగా..

కల్వకుంట్ల చరిత్రను లిఖించదలిచారా?

వాళ్లిద్దరు అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారారు

గవర్నర్‌ దంపతులను సాగనంపిన ముఖ్యమంత్రి

‘ముఖచిత్రం చెక్కించడంలో కేసీఆర్‌ బిజీ’

ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్‌ గణపతి దర్శనం ఎలా?

‘చర్చిల్లో, మసీదుల్లో ఇలానే చేయగలవా?’

ప్రగతి భవన్‌లో గవర్నర్‌కు వీడ్కోలు సభ

‘కాంగ్రెస్ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది’

ఈసారి మహాగణపతి సంపూర్ణ నిమజ్జనం

నేనూ టీవీ సీరియళ్లు చూస్తా...

ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌

హైటెక్‌ కిచెన్‌

ఆస్పత్రులు హౌస్‌ఫుల్‌

పడకలు లేవని ముప్పు తిప్పలు

హరితహారం మొక్కా.. మజాకా!

ఒక మొహర్‌ రూ.50 వేలు..

తెలంగాణ సర్కార్‌కు రాజాసింగ్‌ వార్నింగ్‌

‘ప్రణాళికా’యుతంగా అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా