తల్లిపై కిరోసిన్‌ పోసిన కూతురు

3 Feb, 2018 15:45 IST|Sakshi
లచ్చవ్వను అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యం

తల్లీకూతురు మధ్య తగాదా

తల్లిపై కిరోసిన్‌పోసి నిప్పంటించిన కుమార్తె

చావుబతుకుల్లో వృద్ధురాలు

రాఘవాపూర్‌లో ఘటన

సిద్దిపేటరూరల్‌ : పేగు తెంచుకొని పుట్టిన కూతురు.. కన్నపేగుపైనే నిప్పులు కురిపించింది. తల్లిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. ఈ ఘటన సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవాపూర్‌లో చోటుచేసుకుంది. రాఘవాపూర్‌కి చెందిన గ్యార లచ్చవ్వ (55), భర్త మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. కుమారులు సిద్దిపేటలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. మూడో కూతురైన గ్యార సునీత ఇంటి దగ్గరే ఉంటూ ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. గురువారం ఉద యం తల్లి కూలీ పనికి, సునీత ఆసుపత్రికి వెళ్లారు. రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చిన కూతురుతో కుటుం బానికి సంబంధించి విషయమై లచ్చవ్వ గొడవ పడింది. గొడవ పెద్దది కావడంతో, విచక్షణ కోల్పోయిన సునీత పక్కనే ఉన్న కిరోసిన్‌ డబ్బాను తీసుకుని తల్లిపై కిరోసిన్‌ గుమ్మరిం చింది. ఆపై అగ్గిపుల్ల గీసి నిప్పంటిం చింది. ఒక్కసారిగా ఇంటినిండా మం టలు వ్యాపించాయి. కాలిన గాయాల తో లచ్చవ్వ కేకలు వేసింది. ఇరుగుపొరు గు వారు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే సగానికిపైగా కాలిపోయిన లచ్చవ్వను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. 90 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది. 24 గంటలు గడిచే వరకు ఏం చెప్పలేమని వైద్యులు చెప్పారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు