కొడుకు పెళ్లికి కూతురు వద్ద అప్పు

24 Nov, 2019 10:59 IST|Sakshi
చికిత్స పొందుతున్న తిరుమల

తిరిగి ఇవ్వుమంటే చావుమన్నారు

పుట్టింటి ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతున్న బాధితురాలు

మంచిర్యాలక్రైం: అప్పు ఇచ్చిన పాపానికి తల్లిదండ్రులే చావుపోమన్నారని కూరుతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జిల్లా కేంద్రంలోని మ్యాదరివాడకు చెందిన చేను తిరుపతి రాజేశ్వరిల కూతురు తిరుమలను పెద్దపెల్లి జిల్లా కేంద్రానికి చెందిన ముదిరికోళ్ల రమేష్‌తో 15ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. ఏడాది క్రితం తిరుపతి కొడుకు నవీన్‌ (తిరుమల తమ్ముడు) వివాహానికి అల్లుడు రమేష్‌ వద్ద రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించాలని పలుమార్లు మామను అడగగా దాటవేస్తూ వచ్చాడు. తిరుమల శనివారం పుట్టింటికి వచ్చి తల్లితండ్రులతో డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగింది.

నీవు చచ్చినా డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రులు అనడంతో మనస్తాపానికి గురైన తిరుమల బయటకు వెళ్లి పురుగుల మందు తీసుకుని వచ్చి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం తిరుమల పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి తల్లిదండ్రులు, తమ్ముడు, అతడి భార్యపై చర్యలు తీసుకోవాలని రమేష్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్థానిక ఎస్సై మారుతిని వివరణ కోరగా ఫిర్యాదు అందిన విష యం వాస్తవమేనని తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపాడు.   

మరిన్ని వార్తలు