వారానికోరోజు టీ-టీడీపీకి సమయమిస్తా: బాబు

19 Jul, 2014 01:09 IST|Sakshi
వారానికోరోజు టీ-టీడీపీకి సమయమిస్తా: బాబు

త్వరలోనే తెలంగాణ లో పార్టీకి పూర్తిస్థాయి కమిటీలు

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ పటిష్టత కోసం వారానికోకరోజు సమయమిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో పార్టీకి త్వరలోనే పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలను నియమించనున్నట్లు వివరించారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరైన ఈ సమావేశంలో ఆయన తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అభిప్రాయాన్ని కోరారు. ఈ సమావేశానికి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సనత్‌నగర్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా పార్టీ నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ గైర్హాజరయ్యారు.
 
 

మరిన్ని వార్తలు