రైతు బీమాకు రేపే చివరి గడువు

30 Jul, 2018 12:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హన్మకొండ : రైతు బీమా పథకం గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 20తో గడువు ముగిసినా ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 15న బాండ్‌ పొందాలనుకునే రైతులు ఈనెల చివరి వరకు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ఈ మేరకు బాం డులు జారీ చేసేందుకు జూలై 15 వరకు గడువు విధించగా దరఖాస్తులు సేకరణ పూర్తి కాకపోవడంతో గడువు పెంచుతూ వస్తోంది. ఈ నెలాఖరులోపు రైతుల వివరాలు దరఖాస్తు ఫారంలో నింపి రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించిన రైతులకు వచ్చే నెల 15న బీమా బాండ్లు చేతికందుతాయి. నిర్ణీత సమయంలో దరఖాస్తు ఫారాలు రైతుల నుంచి రాక పోవడంతో మరో అవకాశం ఇచ్చింది.

రైతులందరికీ అవకాశం..

ప్రతి రైతు బీమా కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకం తీసుకువచ్చింది. దీనికి సంబం ధించిన ప్రీమియం ఒక్కో రైతుకు రూ.2,271లు ప్రభుత్వం చెల్లిస్తుండగా భారతీయ జీవిత బీమా సంస్థ ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చింది. రైతు ఏ కారణంచేత మరణించినా అతడి కుటుంబానికి రూ.5 లక్షలు అం దుతాయి.

18 నుంచి 59 ఏళ్ల వయసు రైతులు అర్హులు. ఈ పథకంలో చేరేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫారాలు రైతుల పేరుతో ముద్రించిన ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తు ఫారాల్లో నింపుతున్నారు. ఇందుకు గ్రామ రైతు సమన్వయ సమితులు సహకారం అందిస్తున్నాయి. అయితే వివిధ కారణాలతో నిర్ణీత గడువులోగా దరఖాస్తు పూర్తి చేసి సమర్పించలేక పోయారు. 

కొనసాగుతున్న వివరాల సేకరణ..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 6,16,266 మంది రైతులున్నారు. ఇప్పటి వరకు 4,65,747 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత కలిగిన 3,63,323 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుకు సంబంధించిన నామినీ పేరు, ఆధార్‌ నంబర్, రైతు సంతకం, నామినీ ఆధార్‌ నంబర్‌ వివరాలు తీసుకుంటున్నారు. 

రైతుబంధు చెక్కు పొందిన వారు అర్హులు..

పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులతో పాటు, ఏదేని కారణం చేత పట్టాదారు పాసుపుస్తకం అందక రైతుబంధు చెక్కు పొందిన రైతులు కూడా రైతు బీమా పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. రైతు బంధు చెక్కు అందుకున్న రైతు బీమాకు ఎందుకు అర్హుడు కాకూడదని ఆలోచించి మళ్లీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొందరు రైతులకు బీమా సౌకర్యం కలుగనుంది. 

తర్వాత కూడా  దరఖాస్తు చేసుకోవచ్చు..

31లోగా దరఖాస్తు చేసుకోలేని రైతుల పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను వివరణ కోరగా ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని సమాధానమిచ్చారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓలా.. లీజు గోల

పెట్రోల్‌లో నీళ్లు..

ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల లబ్ధి

గ్రామాలకు అమెరికా వైద్యం

ఆస్తి కోసం నా కుమారుడు చంపేశాడు

సాయంత్రమూ సాఫ్‌

గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం

నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

మండలానికో డెయిరీ పార్లర్‌

చింతమడకలో సీఎం సార్‌ మెనూ..

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

సీఎం కేసీఆర్‌ పర్యటన హైలైట్స్‌!

ఉన్నారా.. లేరా? 

‘నందికొండ’కు క్వార్టర్లే అండ..!

ఉద్యోగాలు కోరుతూ వినతిపత్రాలివ్వొద్దు..

పాములకు పాలు పట్టించడం జంతుహింసే!

జాతీయ రహదారులకు నిధులివ్వండి 

26 నుంచి రాష్ట్ర వాసుల హజ్‌ యాత్ర 

40% ఉంటే కొలువులు

యథావిధిగా గ్రూప్‌–2 ఇంటర్వ్యూలు

‘కళ్లు’గప్పలేరు!

సకల హంగుల పట్టణాలు! 

పోటెత్తిన గుండెకు అండగా

ఎక్కడున్నా.. చింతమడక బిడ్డనే!

చిరునవ్వులు కానుకగా ఇవ్వండి 

మరో 5 లక్షల ఐటీ జాబ్స్‌

‘దాశరథి’ నేటికీ స్ఫూర్తిదాయకం

ఈనాటి ముఖ్యాంశాలు

‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల

పాములకు పాలుపోస్తే ఖబర్దార్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?