అభివృద్ధికి అంకితం

11 Jul, 2014 00:37 IST|Sakshi
అభివృద్ధికి అంకితం

 నల్లగొండ :‘‘జిల్లా సమగ్రాభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతా. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో తాగునీటి కొరత తీర్చేందుకు ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా. పాలన సాఫీగా సాగేందుకు అనుభవజ్ఞులైన పెద్దలతో ప్రత్యేక కమిటీ వేస్తా’’ అని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం ఉదయం 11:05 గంటలకు ఆయన జెడ్పీ కార్యాలయంలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే....
 
 కలిసి మెలిసి...
 మా పార్టీ అధికారంలో లేదు. అయినా అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి అవసరమయ్యే
 నిధులు రాబట్టేందుకు కృషి చేస్తా. ప్రతిపక్ష పార్టీ చెం దిన వ్యక్తిననే భావన లేకుండా జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారాలతో అభివృద్ధికి అంకితమవుతా. అభివృద్ధిలో అధికార, ప్రతిపక్షం అన్న వ్య త్యా సం లేకుండా ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జెడ్పీటీ సీలు, అధికార యంత్రాంగాన్ని భాగస్వాముల్ని చేస్తా.
 
 ఫ్లోరైడ్‌పై ప్రత్యేక దృష్టి
 జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలను ప్రధానాంశంగా తీసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యతక్రమంలో ముందుకు వెళ్తా. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా జిల్లాలో ఫ్లోరైడ్, తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రూ.1400 కోట్లు కేటాయించారు. ఇందులో దేవరకొండకే రూ.100 కోట్లున్నాయి. వీటితోపాటుగా సీఎం ఇచ్చిన హామీ మేరకు భారీస్థాయిలో నిధులు మంజూరు చేయించి పెండింగ్‌లో ఉన్న తాగు, సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తా.
 
 చందంపేటలో ఐటీడీఏ
 ఉమ్మడి రాష్ట్రంలో తలెత్తిన కొన్ని కారణాల వల్ల జిల్లాకు  ఐటీడీఏ ప్రాజెక్టు రాకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మన జిల్లా కూడా ఒకటి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తా. విద్య, వైద్యపరంగా కూడా గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తా.
 
 పెద్దలతో ప్రత్యేక కమిటీ  
 జిల్లా పరిషత్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో అనుభవజ్ఞులైన వారితో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పా టు చేస్తా. ఈ కమిటీ పాలకవర్గ సభ్యులకు, పాలనాయంత్రాంగానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరి స్తుంది. జిల్లాపరిషత్ పాలనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగేందుకు ఈ కమిటీ అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుంది.
 
 పార్టీని వీడే ప్రసక్తి లేదు
 కాంగ్రెస్ పార్టీ నా రాజకీయ భవిష్యత్‌కు పునాదులు వేసింది. ఎన్నో పదవులు కట్టబెట్టింది. పార్టీని వీడి బ యటకు వెళ్లేది లేనేలేదు. ఎలాంటి గ్రూపులులేవు. అం దరిని కలుపుకుపోయే వ్యక్తిని కాబట్టే, అందరి సహకారంతో చైర్మన్ పదవికి ఏక గ్రీవంగా ఎన్నికయ్యా.
 

మరిన్ని వార్తలు