డిగ్రీలో డిటెన్షన్‌..?

21 Jul, 2017 02:09 IST|Sakshi

సీబీసీఎస్‌ అమలుకు కసరత్తు
ఇంజనీరింగ్‌ తరహాలో క్రెడిట్‌పాయింట్లు

సాక్షి, హైదరాబాద్‌:  వృత్తి విద్యా కోర్సుల తోపాటు డిగ్రీ కోర్సుల్లోనూ ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టంను (సీబీసీఎస్‌), సెమిస్టర్‌ విధా నాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం  డిగ్రీ లోనూ డిటెన్షన్‌ విధానం అమల్లోకి తెచ్చేం దుకు ఆలోచిస్తోంది. ఇంజనీరింగ్‌  సెమిస్టర్‌ లో ఫస్టియర్‌ నుంచే డిటెన్షన్‌ విధానాన్ని గత ఏడాది నుంచి అమలు చేస్తోంది.  ఈ ఏడాది నుంచి డిగ్రీలోనూ దానిని అమలు చేయాలని యోచిస్తోంది.

ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌లో ఉండే రెండు సెమిస్టర్లలో విద్యార్థి కనీసంగా సగం క్రెడిట్స్‌ (పాయింట్లు) సంపాదిస్తేనే సెకండియర్‌లోని మూడో సెమిస్టర్‌కు అవకా శం కల్పిస్తారు.  మొదటి సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టులు పాస్‌ కాపోయినా, అటెండెన్స్‌ ఉంటే రెండో సెమిస్టర్‌కు అనుమతి ఇస్తు న్నాయి.  రెండో సెమిస్టర్‌ పూర్తయ్యే నాటికి  మొదటి రెండు సెమిస్టర్లలోని సగం క్రెడిట్లను ఆ విద్యార్థి సంపాదించాలి. లేదంటే మూడో సెమిస్టర్‌లో ప్రవేశం ఉండదు. ఇదే తరహా విధానాన్ని డిగ్రీలోనూ అమలు చేసేందుకు కసరత్తు ప్రా రంభించింది.  దీనిపై త్వరలోనే వైస్‌ ఛాన్స్‌లర్ల సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు