నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

3 Jan, 2018 05:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌– న్యూఢిల్లీ(12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం(3న) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి నుంచి ఉదయం 6.25కు బదులు మధ్యాహ్నం 2.25కు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకల్లో అంతరాయం చోటుచేసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు