టాయిలెట్‌లోనే ప్రసవం

22 Jul, 2017 02:38 IST|Sakshi
టాయిలెట్‌లోనే ప్రసవం
దేవరకొండ: ప్రభుత్వ ఆస్పత్రి టాయిలెట్‌లో ఓ మహిళ ప్రసవించింది. కాన్పులో ఓ శిశువు కు జన్మనివ్వగా.. రెండో శిశువును బయటికి తీసేందుకు నర్సులు చేసిన ప్రయత్నం వికటించి శిశువు మరణించింది. నర్సుల నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగింది. పీఏపల్లి మండలం నంబాపూర్‌కు చెందిన నేనావత్‌ కిష్టు, కవిత దంపతులు. కవితకు గురువారం అర్ధరాత్రి నొప్పులు రావడం తో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. కాల్‌డ్యూటీ డాక్టర్‌ శశికళకు సిబ్బంది సమాచారం అందించారు. ఈలోపు కవితను బంధువులు టాయిలెట్‌కు తీసుకెళ్లారు. బాత్‌రూమ్‌లో ప్రసవం జరిగి కాన్పుల్లో ఒక శిశువుకు జన్మనిచ్చింది.
 
ఆస్పత్రి ఎదుట ధర్నా 
ఆస్పత్రి సిబ్బంది కవితను వార్డుకు తరలిం చేందుకు డబ్బులు డిమాండ్‌ చేశారని ఆరోపి స్తూ బాధితురాలి బంధువులు మృత శిశువు తో ఆందోళనకు దిగారు. శిశువు ప్రాణం పోవడానికి కారణమైన వైద్యులపై చర్య తీసుకోవాలని కోరారు. కవలల విషయంలో కొన్ని సమయాల్లో కాన్పు సమయాని కంటే ముందే జరుగుతుందని ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ రాములు నాయక్‌ తెలిపా రు. కవిత విషయంలో అదే జరిగిందన్నారు. నెక్‌ఆఫ్‌ది మూమెంట్‌లో ఆస్పత్రికి తీసుకు రావడంపై ఈ ప్రమాదం జరిగిందన్నారు. 
మరిన్ని వార్తలు