గల్లీ కొట్టు.. సూపర్‌ హిట్టు!

20 Jul, 2020 02:21 IST|Sakshi

కిరాణా, గల్లీ షాపుల్లో పెరిగిన కొనుగోళ్లు

ప్రతి ముగ్గురు వినియోగదారుల్లో ఇద్దరు లోకల్‌ బ్రాండ్ల వైపే మొగ్గు

జూన్‌లో సౌందర్య సాధనాల అమ్మకాల్లో భారీగా వృద్ధి

గ్లోబల్‌ డేటా అనలిటిక్స్‌ కంపెనీ నీల్సన్‌ సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఇళ్ల దగ్గరి కిరాణా షాపులు, గల్లీ చివరి దుకాణాల్లో సరుకుల కొనుగోళ్లు పెరిగాయి. ప్రతీ ముగ్గు రు వినియోగదారుల్లో ఇద్దరు ఎక్కువగా లోకల్‌ బ్రాండ్స్‌ సరుకులు, వస్తువులనే కొంటామంటున్నారు. ప్రస్తుతం భారత్‌లోని ‘ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) మార్కెట్‌’కు డిమాండ్‌ పెరిగి దాదాపుగా కరోనాకు ముందు నాటి స్థాయికి చేరుకుంటోంది. గతంలో మాదిరే మళ్లీ డియోడరెంట్స్, హెయిర్‌ కలర్స్, స్కిన్‌కేర్‌ వంటి ప ర్సనల్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోళ్లకు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తినడం, బయటి ఫుడ్‌ ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోవడంతో ఇళ్లలోనే వండుకునే వారి శాతం పెరిగి ప్యాకేజ్డ్‌ ఆటా, రిఫైన్డ్‌ ఆయిల్‌ వంటి వాటికి జూన్‌లో భారీగా డిమాండ్‌ పెరిగింది. వీటితో పాటు లిక్విడ్‌ సోప్స్, చ్యవన్‌ప్రాశ్, బ్రాండెడ్‌ తేనె వంటి వాటి కొనుగోళ్లు పెరిగాయని గ్లోబల్‌ డేటా అనలిటిక్స్‌ కంపెనీ నీల్సన్‌ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది.

పుంజుకుంటున్న కొనుగోళ్లు: పట్టణాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ నిత్యావసరా లు, ఇతర సంప్రదాయక కొనుగోళ్లతో పాటు ఆహారేతర కేటగిరీల్లోనూ కొనుగోళ్లు పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో గతేడాది జనవరి–మే మధ్యకాలంతో ఈ ఏడాది అదే కాలాన్ని పోలిస్తే వినియోగదారుల మార్కెట్‌ తక్కువగా నమోదు కాగా, ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నట్టు తేలింది.

పెరిగిన బ్యూటీకేర్‌ అమ్మకాలు: లాక్‌డౌన్‌ సమయం లో కాస్మటిక్స్, సౌందర్య సాధనాలు, సంబంధిత వస్తువులపై పెట్టే ఖర్చును కస్టమర్లు బాగా తగ్గించుకున్నారు. అలాగే, రోజువారీ వస్తువుల కేటగిరీలోని టూత్‌పేస్ట్‌లు, షాంపూలు, హెయి ర్‌ ఆయిల్, వాషింగ్‌ పౌడర్, సబ్బులు వంటివి గతంతో పోలిస్తే మితంగా కొనుగోలు చేసి ఉపయోగించారు. ఇప్పుడు మళ్లీ జూన్‌లో వీటి కొనుగోళ్లు పెరగడంతో పా టు సౌందర్య సాధనాలు, ఇతర బ్యూటీకేర్‌ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినట్టు సర్వేలో తేలింది.

ఇంటికే సరుకులు..
నీల్సన్‌ సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా దేశంలోని 22 నగరాల్లోని వినియోగదారుల ను వివిధ అంశాలపై ప్రశ్నించిం ది. పట్టణ ప్రాంతాల్లోని పలువురు కస్టమర్లు వస్తువుల్ని డోర్‌ డెలి వరీ చేయాలని కో రుకుంటున్నట్టు వెల్లడైంది. దీంతో కిరాణా షాపులు మొదలు డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ వరకు ఫోన్‌ లేదా వాట్సాప్‌ ఆధారిత వ్యవస్థల ద్వారా వినియోగదారుల ఇళ్లకే సరుకులు çపంపే ఏర్పాట్లు చేస్తున్నాయి. మున్ముందు తమ ఆన్‌లైన్‌ షాపింగ్‌ను 20 శాతానికిపైగా పెంచబోతున్నట్టు 62 శాతం మంది చెప్పినట్టు ఈ అధ్యయన సంస్థ తెలిపింది.

లోకల్‌ బ్రాండ్‌ అంటే..
లాక్‌డౌన్, చైనాతో కయ్యం.. ఈ పరిణామాల నేపథ్యంలో లోకల్‌ ప్రొడక్ట్స్, బ్రాండ్స్‌కు డిమాండ్‌ పె రుగుతోంది. తాము కొనే వస్తువు ల్లో స్థానిక బ్రాండ్స్‌కే మొగ్గుచూపుతామని ప్రతీ ముగ్గురు వినియోగదారుల్లో ఇద్దరు చెప్పినట్టు నీల్సన్‌ సర్వే తెలిపింది. సర్వేలో ‘లోకల్‌ బ్రాండ్‌’ అంశంపై ఎవరెలా స్పందించారంటే..
♦ 78% దేశంలో తయారైనదే స్థానిక బ్రాండ్‌
♦ 50% లోకల్‌ బ్రాండ్లే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని పెంచుతాయి
♦ 49% దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే బ్రాండే స్థానిక బ్రాండ్‌
♦ 48% బ్రాండ్‌ హెడ్‌క్వార్టర్‌ భారత్‌లో ఉంటే అదే లోకల్‌ బ్రాండ్‌
♦ 43% ఆయుర్వేద ఔషధాలు, సహజ మూలకాలు వంటి వస్తువుల తయారీ సంస్థలే లోకల్‌ బ్రాండ్‌

మరిన్ని వార్తలు