‘జైశ్రీరాం’ వరికి పెరుగుతున్న డిమాండ్

26 Nov, 2014 01:46 IST|Sakshi
‘జైశ్రీరాం’ వరికి పెరుగుతున్న డిమాండ్

మోర్తాడ్: సన్నరకంలో మరింత సన్నగా ఉండే జై శ్రీరాం రకం వరికి డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేటు విత్తన కంపెనీలు ఐదేళ్ల కింద జై శ్రీరాం రకం వరి విత్తనాలను ఉత్పత్తి చేశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూ ర్ సబ్ డివిజన్‌లోని రైతులు దీనిని ఎక్కువగా సాగు చేశారు. సాధారణంగా సన్న రకాల్లో బీపీటీ, హెచ్‌ఎంటీ రకాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. జై శ్రీరాం రకం బీపీటీ, హెచ్‌ఎంటీల కంటే సన్నగా ఉండటంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.
 
బీపీటీ, హెచ్‌ఎంటీ ల ధర అంతంతమాత్రమే. జై శ్రీరాం రకానికి మాత్రం పెరుగుతోంది. మార్కెట్ ఆరంభమైన మొదట్లో క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,750 పలికిన ధర ఇప్పుడు రూ. 2,200కు చేరింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సన్న రకాలను దాదాపు 70 వేల హెక్టార్ల వరకు సాగు చేశారు. జై శ్రీరాం రకాన్ని ఎనిమిది వేల ఎకరాల వరకు పండించారు. బీపీటీ, హెచ్‌ఎంటీలు ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి లభిస్తే జై శ్రీరాం రకం 15 నుంచి 25 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తుంది. జై శ్రీరాం క్వింటాల్ ధర రూ. 2,300 ఉంది. ఈ రకం బియ్యం క్వింటాల్‌కు రూ. 5,200కు పైగా ఉంది.

మరిన్ని వార్తలు