గ్రామాల్లో దంత వైద్య శిబిరాలు

20 Jan, 2018 01:38 IST|Sakshi

వైద్య మంత్రి లక్ష్మారెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. వైద్యాన్ని మారుమూల గ్రామాలకే కాదు, సామాన్య ప్రజల చెంతకూ తీసుకెళుతున్నామని చెప్పారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పరిధిలోని డెంటల్‌ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ డెంటల్‌ హాస్పిటల్‌ను లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. వాహనం లోపలి సదుపాయాలను పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లా డారు. ‘మొబైల్‌ డెంటల్‌ హాస్పిటల్‌ వాహనాన్ని మారుమూల గ్రామాలకు పంపి దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. వాహనంలో ఏసీతో పాటు రెండు ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. దంత సమస్యలను పరీక్షించి, ఎక్స్‌ రే తీసి అవసరమైన చికిత్స అందించవచ్చు. ఇద్దరు వైద్యులు, సిబ్బంది, పరికరాలు, మందులు వాహనంలోనే ఉంటాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొబైల్‌ వాహనాలను, బైక్‌ అంబులెన్స్‌ లను, రెక్కల వాహనాలను, టీకా బండ్లను ప్రారంభించాం. వచ్చే బడ్జెట్‌లోనూ వైద్య శాఖకు మరిన్ని నిధులు ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ అంగీకరించారు’ అని చెప్పారు.    

మరిన్ని వార్తలు