కార్మిక శాఖలో సంస్కరణలు: దత్తాత్రేయ

24 Apr, 2016 04:53 IST|Sakshi

హైదరాబాద్: కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రెండు రోజులపాటు సాగే ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్(ఏఐఎస్‌బీఐఎస్‌ఎఫ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్(ఎస్‌బీఐఎస్‌యూ) ైెహ దరాబాద్ సర్కిల్ సర్వసభ్య సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు.

1925, 1948, 1949లో రూపొందించిన కార్మిక చట్టాలే ఇప్పటికీ అమలులో ఉన్నాయని, వాటిని మార్చాలని కేంద్రం భావిస్తోందన్నారు. ప్రధానంగా ప్రజల, దేశ సంక్షేమం కోరే సంస్థల్లో పనిచేసే కార్మికులందరినీ ఒక కుటుంబంగా పరిగణిస్తూ ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్నామన్నారు. ఉద్యోగినుల మెటర్నిటీ సెలవులు 12 వారాల నుంచి 28 వారాలకు పెంచాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ సీసీ ముంబై డీఎండీ, సీడీవో అశ్వినీ మెహ్రా, యూఎన్‌ఐ గ్లోబల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఫిలిప్ జెన్నింగ్స్, ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ హరిదయాళ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు